
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (పాత చిత్రం)
సాక్షి, నాగర్ కర్నూలు : మహాకూటమికి మహా ఓటమి తప్పదని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో వివిధ పార్టీలకు చెందిన 60మంది జూపల్లి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోకు ఆకర్షితులై మరింత మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
ఇచ్చిన హామీని అక్షరాలా అమలు చేయటం సీఎం కేసీఆర్ నైజమని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ నైజమన్నారు. మహా కూటమి కాదని తెలంగాణ ప్రజల పట్ల కుళ్లుకుతంత్రాల కూటమని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఆకాంక్షించే టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment