సాక్షి, నిర్మల్: తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్టేజ్‌కు రాజకీయాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ సర్కార్, కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా కుంటాల మండలం ఓలా గ్రామంలో సంజయ్ మాట్లాడుతూ.. లిక్కర్, డ్రగ్స్, పేకాట దందా చేసేటోళ్ల అంతు చూస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీఆర్‌ఎస్ నేతలు డ్రగ్స్ దందా చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. బెంగళూరు పోలీసులను మేనేజ్ చేసి కేసును మూసివేయించారు. ఆ కేసును మళ్లీ బయటకు తీస్తాం. కేసీఆర్ సహా ఎవరినీ వదిలిపెట్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందే. హామీలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ను ప్రజలు నిలదీయాలి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తున్నదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment