గవర్నర్‌ ఆరోపణలపై స్పందించిన కల్వకుంట్ల కవిత | TRS MLC Kalvakuntla Kavitha Reacts On Governor Tamilisai Allegations | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ ఆరోపణలపై స్పందించిన కల్వకుంట్ల కవిత.. ఏమన్నారంటే..

Published Thu, Sep 8 2022 7:14 PM | Last Updated on Thu, Sep 8 2022 7:23 PM

TRS MLC Kalvakuntla Kavitha Reacts On Governor Tamilisai Allegations - Sakshi

మేడారం వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ కూడా ఇవ్వలేదంటూ గవర్నర్‌.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తాజా వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తన మూడేళ్ల పాలనపై రాజ్‌భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. 

గవర్నర్‌ ఆరోపణలపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో.. గవర్నర్‌ కార్యాలయం రాజకీయ వేదికగా మారింది. అది కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌గారి పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలు తెలంగాణ ప్రజలను మోసం చేయలేవని గ్రహించిన తరుణంలోనే.. గౌరవనీయులైన గవర్నర్ ప్రకటనలు వెలువడడం గమనార్హం అంటూ ఆమె ఓ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: రాజ్‌భవన్‌పై వివక్ష చూపుతున్నారు.. గవర్నర్‌ తమిళిసై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement