తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని టీఆర్‌ఎస్ నేత గుంగుల కమలాకర్ తెలిపారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆయన ఇవాళ సాయంత్రం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.