న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ మంత్రి గోయల్ పేర్కొన్నారు. తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారని, ధాన్యం కొనుగోలులో ఏ రాష్ట్రంపై వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరిస్తున్నామని పీయూష్ గోయల్ తెలిపారు. పంజాబ్‌కు అనుసరిస్తున్న విధానమే తెలంగాణకు అనుసరిస్తున్నామన్నారు.
రా రైస్ ఎంత ఇస్తామనే విషయం ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదని, ఎన్నిసార్లు అడిగినా టీఎస్ సర్కారు స్పందించలేదన్నారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, తెలంగాణ నేతలు అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఫిబ్రవరి 22, మార్చి 8వ తేదీల్లో సమావేశాలకు రావాలని ప్రభుత్వాన్ని కోరినా ఆ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు రాలేదని పీయూష్ గోయల్ తెలిపారు.కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment