![TRS MLA Rega Kantha Rao Fires On TRS Government In Assembly In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/4/Rekha-Kantha-Rao.jpg.webp?itok=lWFYwMfH)
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్నచోటే ప్రభుత్వం నిధులను ఖర్చుచేస్తోందని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్‌లో తదితర ప్రాంతాల్లో.. నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం సరైన నిధులను మంజూరు చేయడంలేదని అన్నారు.
పినపాక నియోజక వర్గంలో ఎన్నికలు లేకపోవడంతో అక్కడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ప్రశ్నలకు పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్ సమాధానం చెప్పాలని కోరారు.
చదవండి: కేటీఆర్ వాహనానికి చలాన్.. ట్రాఫిక్ ఎస్‌ఐని అభినందించిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment