rega kantarao
-
TRS: తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్నచోటే ప్రభుత్వం నిధులను ఖర్చుచేస్తోందని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్‌లో తదితర ప్రాంతాల్లో.. నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం సరైన నిధులను మంజూరు చేయడంలేదని అన్నారు. పినపాక నియోజక వర్గంలో ఎన్నికలు లేకపోవడంతో అక్కడి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ప్రశ్నలకు పురపాలక శాఖా మాత్యులు కేటీఆర్ సమాధానం చెప్పాలని కోరారు. చదవండి: కేటీఆర్ వాహనానికి చలాన్.. ట్రాఫిక్ ఎస్ఐని అభినందించిన మంత్రి -
సీఎల్పీ విలీనం ఖాయం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియనాయక్ చెప్పారు. విలీన ప్రక్రియపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీ ఆర్ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామంతా టీఆర్ఎస్లో చేరనున్న ట్లు చెప్పారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పూర్తి కోసమే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రం లో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని, స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కు ఏకపక్షం గా తీర్పునిస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల బీఫారాల పంపిణీని టీఆర్ఎస్ ప్రారంభించిన నేపథ్యంలోనే తాము కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురికీ సంబంధించిన నియోజక వర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యకు అనుగుణంగా జాబితాను అందజేసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని కలసి బీఫారాలను తీసుకెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్లో సీఎల్పీని విలీనం చేసే ప్రక్రియ కోసమే ఈ ముగ్గురు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిసింది. విలీన ప్రక్రియకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయడంలో భాగంగానే వీరిని టీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానించినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లో మిగిలేది ‘ఆ ముగ్గురే’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ‘ఆ ముగ్గురు’ మాత్రమే మిగులుతారని, మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకే వస్తారని అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని, విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల బీఫారం కోసం వచ్చామని తెలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమయ్యాయం. మా ప్రాంతం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం... పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పూర్తి కోసం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నాం. టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభపక్షం విలీనం కచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యేలం మేమే ఉన్నాం. ఇప్పటికే పది మంది కలిసి వచ్చాం. ఒకటిరెండు రోజుల్లో అది కూడా జరుగుతుంది. విలీనం ఖాయం. ఎప్పుడనేది అందరికీ కంటే ముందుగా మీడియాకే చెబుతాం. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తారు. సీఎం కేసీఆర్ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ రాష్ట్రంలో, దేశంలోనే బలమైన రాజకీయశక్తిగా ఏర్పడుతుంది. కాంగ్రెస్‌లో ఆ ముగ్గురే మిగులుతారు. మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకి వస్తారు’ అని అన్నారు. టీఆర్ఎస్ బీపారాల పంపిణీ... స్థానిక సంస్థల ఎన్నికల బీఫారాలను పంపిణీని టీఆర్ఎస్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించిన వారికి సైతం టీఆర్ఎస్ బీఫారాలను ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీకి వచ్చారు. వారి నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యకు అనుగుణంగా జాబితాను అందజేసి టీఆర్ఎస్ బీఫారాలను తీసుకెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డిని కలిసి బీఫారాలను తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభపక్షం విలీనం ప్రక్రియ కోసమే ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిసింది. విలీనం ప్రక్రియకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానించినట్లు తెలిసింది. -
కాంగ్రెస్ నేతలవి అసత్య ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో చేరుదామనుకున్న తమపై కాంగ్రెస్ అగ్రనేతలు దుష్ప్రచారానికి పాల్పడటం తగదని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు అన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. పార్టీ మారుదామనుకున్న తమపై పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో కలసి నడవాలని నిర్ణయించుకున్నామని ఇప్పటికే స్పష్టం చేశామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని లేఖలో ప్రస్తావించామని పునరుద్ఘాటించారు. ఎంతకు అమ్ముడు పోయారని మాపై సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసుల ఆత్మగౌరవం దెబ్బతినేలా కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలలో నాలుగు గ్రూప్‌లు ఉన్నాయి, వారు ఎక్కడికి వచ్చి ధర్నాలు చేస్తారో తామూ చూస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.50 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంత ఎమ్మెల్యేలకు ఆఫర్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆత్రం సక్కు మాట్లాడుతూ.. అగ్రవర్ణాల ఎమ్మెల్యేలు పార్టీలు మారితే.. విమర్శించరుగానీ, ఆదివాసీ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే.. ఆత్మగౌరవం దెబ్బతినేలా ఆరోపణలు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. తమపై కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నెలన్నర కిందటే టచ్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీ మార్పు నిర్ణయం ఇప్పటికిప్పుడు జరిగింది కాదని, జనవరి తొలి రెండు వారాల్లోనే ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది. జనవరి 17 నుంచి 20 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన అనంతరం జనవరి 19న కాంగ్రెస్‌కు చెందిన ఆదివాసీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్కలతో కలసి సక్కు, కాంతారావులు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, పోడు భూముల సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడారు. అయితే అంతకంటే ముందే సక్కు, కాంతారావులు సీఎంను కలిశారని, పార్టీ మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారని సమాచారం. సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ వారికి సూచించారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే కాంతారావు పార్టీపై తనకున్న అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటిం చారు. డీసీసీ అధ్యక్షుల నియా మకం సందర్భంగా కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని తనను సంప్రదించకుండానే నియమించారంటూ పార్టీ పదవులకు కాంతారావు రాజీనామా చేశారు. కానీ దాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. ఐదుగురిని నిలబెట్టినప్పుడే... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరబోతున్నారనే చర్చ గత వారం నుంచి జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే బలమున్నప్పటికీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఐదుగురిని (మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి) కేసీఆర్ బరిలో దింపినప్పుడే ఈ చర్చ ప్రారంభమైం ది. ఆ సభ్యులు ఎవరనేది మాత్రం శనివారం వరకు సస్పెన్స్‌గానే సాగింది. చివరకు సక్కు, రేగా తాము టీఆర్ఎస్లో చేరబోతున్నామని ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. మళ్లీ ఇప్పుడు ఇంకా ఎంతమంది, ఎవరెవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రకటనలు చేస్తారో అనే ఉత్కంఠకు తెరలేచింది. ‘చే’జారినట్టే..! కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు టీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్టేనని రాజకీయ వర్గాలంటున్నా యి. ఇప్పుడు కాంగ్రెస్‌కున్న 17 మంది, టీడీపీకి ఉన్న ఒక సభ్యుడు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినా వచ్చేది 18 ఓట్లేనని, అప్పుడు కచ్చితంగా ద్వితీయ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ ఓటుతో టీఆర్ఎస్ లేదా ఎంఐఎంకు చెందిన ఐదో అభ్యర్థి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విధంగా రేగా, సక్కులతో ఓటు వేయించకపోయినా అధికార పక్షానికి వచ్చే నష్టం ఏమీ లేదని, కాంగ్రెస్‌కు వచ్చే 18 ఓట్లతో ఆ పార్టీ గెలుపు సాధ్యం కాదని లెక్కలు చెబుతున్నాయి. దీం తో ఇక గ్రాడ్యుయేట్స్ కోటాలో బరిలో ఉన్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గెలుపుపైనే గంపెడాశలు పెట్టుకుం ది. మరోవైపు అధిష్టానం ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేకుండా ఎన్నాళ్లు కొనసాగుతామని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దళిత ఎమ్మెల్యే సంపత్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం, వారికి భద్రత తీసేసి, వారి నిధులు నిలిపేసినప్పుడు పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలైనా, ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా పార్టీపరంగా భరోసా కల్పించకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని ఆయన వాఖ్యానించినట్లు తెలిసింది. -
టీఆర్ఎస్లోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, కొత్తగూడెం: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతోపాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షణకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత పదునుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్క చోటకూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా విపక్ష ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరే విషయమై అన్ని వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరుగురు పోటీ పడుతున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలను గెలుపొందేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆ స్థానాన్ని కూడా చేజిక్కించుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గత నెల 25న ఆదివాసీ ప్రాంత ఎమ్మెల్యేలతో ఏజెన్సీ నియోజకవర్గాల సమస్యలపై ప్రగతిభవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు భద్రాచలం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, ఆత్రం సక్కు హాజరయ్యారు. పినపాక నియోజకవర్గంలో సాగునీరు, మిషన్ భగీరథలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అంశాలపై సీఎంకు రేగా కాంతారావు క్షుణ్ణంగా వివరించారు. పరిష్కార మార్గాలు సైతం సూచించారు. దీంతో 26న ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను పినపాక నియోజవర్గంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కేసీఆర్ సూచించగా, ఆమె ఎమ్మెల్యే రేగా సమక్షంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే రేగా టీఆర్ఎస్లో చేరే విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా శనివారం రేగాతోపాటు మరో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో వారిద్దరూ టీఆర్ఎస్లో చేరేది ఖాయమైపోయినట్లే. నేడు లేదా రేపు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మానుకోట ఎంపీ టికెట్‌పై పీసీసీ నాయకత్వాన్ని నిలదీసిన రేగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీ లోక్‌సభ నియోజకవర్గాలైన మహబూబాబాద్, ఆదిలాబాద్‌లకు సంబంధించి ఒక సీటును లంబాడాలకు, మరో సీటును ఆదివాసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే తాజాగా రెండు టికెట్లను లంబాడాలకే ఇవ్వనున్నట్లు తెలియడంతో ఆదివాసీ ఎమ్మెల్యేలు దీనిపై పీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆదివాసీ ఎమ్మెల్యేలందరికీ నాయకత్వం వహిస్తున్నది రేగానే కావడం విశేషం. ఆదివాసీలకు ఎంపీ టికెట్ కేటాయించకపోవడంపై రేగా ఒకింత గట్టిగానే పీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ నేరుగా ఆదివాసీ ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల విషయమై సమీక్షలు నిర్వహించడం, రేగాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడటంతో పరిణామాలు మరింత వేగంగా మారిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో ప్రాతినిథ్యం లేని టీఆర్ఎస్కు రేగా చేరికతో ఆ లోటు పూడనుంది. ఇదే ఒరవడితో జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంయుక్త ప్రకటన విడుదల చేసిన రేగా, ఆత్రం.. ఇటీవలే తాము కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశామని, ఎస్టీలు, ముఖ్యంగా ఆదివాసీల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని పినపాక, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు శనివారం సంయుక్తంగా ప్రకటన చేశారు. పోడు భూముల సమస్య, ఇప్పటికే గిరిజనుల సాగులోఉన్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే అంశం, వివిధ రకాలుగా జరుగుతున్న అధికారుల వేధింపులు, ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతోపాటు ఇతర అంశాలను కేసీఆర్‌తో చర్చించామని, వీటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, తిరిగి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నామని ప్రకటించారు. -
ఆ ఇద్దరి భవితవ్యం ఏమిటో?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికల వేళ తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ఇంటిపోరుతో సతమతమవుతున్న కుంజా సత్యవతి (భద్రాచలం), రేగా కాంతారావు (పినపాక) తమ రాజకీయ భవితవ్యంపై గందరగోళంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండే వర్గపోరును సరిగా అంచనా వేయలేకపోయిన వీరు ఇప్పుడు వారి వారి నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అసమ్మతి ఉన్నా సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినా... టికెట్ రాకుండా ఉండేందుకుగాను స్థానిక నాయకులు, సీనియర్లు చేస్తున్న ప్రయత్నాలు వీరికి గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ వస్తుందో రాదో... వచ్చినా విజయానికి స్థానిక కేడర్ ఏ మేరకు సహకరిస్తుందో అనే ఆందోళన వీరి అనుయాయుల్లో వ్యక్తమవుతోంది. వర్గపోరు ప్రభావం... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో 2009 అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కొత్తముఖాలు టికెట్టు దక్కించుకున్నాయి. వీరిలో ఈ ఇద్దరూ ఉన్నారు. తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు పనిచేసి తమ అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు కానీ కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరును సరిగా అంచనావేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీలోని సీనియర్లు వీరిపై గుర్రుగా ఉన్నారు. అందులో భాగంగానే వీరికి టికెట్లు రాకుండా కొత్త వారికి అవకాశం ఇప్పించాలని పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి చట్టసభకు వెళ్లిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు అంటేనే పార్టీలోని సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశానికి పార్టీ పరిశీలకుడు వచ్చిన సందర్భంగా వారు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కాంతారావు సీనియర్లను పట్టించుకోవడం లేదని, పార్టీ పరిశీలకునికి తమ అభిప్రాయాలు కూడా చెప్పనీయకుండా అడ్డుకున్నారని పార్టీ జిల్లా నాయకుడు కుంజా శంకర్, నాగేశ్వరరావు, గుండాల మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు ఆనాడే విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని వారు ప్రశ్నించారు. కాంతారావు వ్యతిరేకులంతా సుబ్బారావు అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంతారావు అభ్యర్థిత్వం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు సుదీర్ఘకాలం సీపీఎంలో పనిచేసి అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి అంతే అనుహ్యం గా ఎమ్మెల్యే అయిన కుంజా సత్యవతి పరిస్థితి కూడా డోలాయమానంలోనే ఉంది. ఈమె తీరుపట్ల స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేగా స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా సీనియర్లు మాత్రం ఆమెకు సహకరించడం లేదు. సత్యవతి లేదా ఆమె భర్త ధర్మాకు ఈసారి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే వర్గం కోరుతుంటే మరో నాయకుడు కూడా తనకు టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. కొందరు సీనియర్లయితే ఈసారి సత్యవతి కుటుంబానికి టికెట్ ఇస్తే సహించేది లేదని, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఆమెపై వ్యతిరేకత ఉందని అంటున్నారు. కేంద్రమంత్రి బలరాంనాయక్ సూచించే మనిషికి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంతారావు, సత్యవతికి మళ్లీ టికెట్ వస్తుందా? వచ్చినా స్థానిక కేడర్ సహకరిస్తుందా? కొత్త ముఖాలు తెరపైకి వస్తాయా? అనేది చర్చనీయాంశమవుతోంది.