సాక్షి, హైదరాబాద్: ‘నేను ఈ రాష్ట్రానికి సేవలు చేస్తూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. కానీ బాధపడడం లేదు. నా సేవలను తెలంగాణ ప్రజలకు అందిస్తూనే ఉంటాను’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘నేను ఎవరు ఆపినా... ఆగను కలుస్తాను.. కలుస్తూనే ఉంటాను’అని స్పష్టం చేశారు. గురువారం రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో వేడుకలకు వచి్చన ప్రముఖులు, రాజ్‌భవన్ అధికారులు రెండు వేడుకలను ఒకే వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు కళాకారులను గవర్నర్ సన్మానించారు. అనంతరం ఆమె పూర్తిగా తెలుగులో మాట్లాడారు. ‘అందరికీ నమస్కారం.. ఈ రాష్ట్రం నాది. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు.
ఈ రాష్ట్రానికి సహోదరిని’అని ప్రసంగం ప్రారంభించారు. ‘రాష్ట్రపతి, ప్రధాని నాకు ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. నేను కూడా ఆ అవకాశాన్ని చక్కగా సది్వనియోగం చేస్తున్నాను. రాజ్‌భవన్ తరపున చాలా కార్యక్రమాలు చేపట్టాము. రాజ్‌భవన్ స్కూల్‌లో భోజన కార్యక్రమం చేపట్టి, కరోనా కాలంలో నిరి్వరామంగా పర్యవేక్షించాం. భద్రాచలం, ఆదిలాబాద్‌లలో ఆదివాసీ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశాం. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాం’అని చెప్పారు. ఎందరో త్యాగశీలుల ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ అని, తెలగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అంతకుముందు వేడుకలను పురస్కరించుకొని గవర్నర్ కేక్ కట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment