బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా(పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహన్ని నింపారు. అంతేకాకుండా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విధంగా అమిత్ షా ట్విటర్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలను ఆకర్షించేందుకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘జన ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందకుండా అక్కడి ప్రభుత్వం వ్యవహారించడం బాధాకరమని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా నే తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. దీనిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ స్వార్ధ ఆలోచన కారణంగా తెలంగాణ పేదలు ఈ అద్భుతమైన కార్యక్రమ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.
— Amit Shah (@AmitShah) September 24, 2018
దీనిపై ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. పేదల వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కార్యకర్తలు నిలదీయాలి.
Comments
Please login to add a commentAdd a comment