
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని టీఆర్‌ఎస్ నేత గుంగుల కమలాకర్ తెలిపారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆయన ఇవాళ సాయంత్రం మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
కాగా తెలంగాణ కేబినేట్ విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు (సిద్దిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), శాసనమండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ పేర్లు ఖరారయ్యాయి. తొలిసారిగా కేసీఆర్ కేబినేట్ ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. ఇప్పటికే మంత్రుల జాబితాతో రాజ్‌భవన్ వెళ్లిన కేసీఆర్.. ఆ జాబితాను గవర్నర్‌కు అందజేశారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లోకొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
చదవండి: కేబినెట్‌లోకి ఆరుగురు