
సాక్షి, హుస్నాబాద్ (సిద్దిపేట): టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌పై తెలంగాణ ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు టీఆర్‌ఎస్ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లోకేష్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా, హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్న ఆంధ్ర నాయకులు ఏమయ్యారో ప్రజలకు తెలుసని ఈటెల మండిపడ్డారు. ప్రశాంతమైన అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల మెప్పుపొందిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
చదవండి: లోకేష్ ఏమన్నాడంటే..
Comments
Please login to add a commentAdd a comment