జిల్లాల పునర్విభజనతో నష్టం కలగదు | No Loss with District Redesign | Sakshi
Sakshi News home page

జిల్లాల పునర్విభజనతో నష్టం కలగదు

Published Sat, Aug 27 2016 10:11 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

మాట్లాడుతున్న ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే

– ఎంపీ జితేందర్‌రెడ్డి
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : జిల్లాల పునర్విభజన వల్ల ఏ జిల్లాకు నష్టం కలగదని, ప్రతి జిల్లాకు సాగునీరు అందిస్తామని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు మా జిల్లాకు రాలేదని, వేరే జిల్లాకు వెళ్లిందని ఆందోళన చెందొద్దని, సాగునీరు అన్ని ప్రాంతాలకు వస్తాయన్నారు. వచ్చే దసరా నుంచి జిల్లాల నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు. అన్ని జిల్లాలు అభివద్ధి పథంలో నడుస్తాయన్నారు. క్రీడాభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తుందని చెప్పారు. 2024 ఒలంపిక్స్‌ దేశంలో జరిగేందుకు ప్రభుత్వాలు కషి చేయాలన్నారు. కష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని, అందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 
 
 
ఒప్పందపత్రం చూపితే తప్పుకుంటాం
మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నట్లు ఒప్పందపత్రం చూపితే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు. ఏ ప్రాంతం అయినా సాగునీరు ఉంటేనే అభివద్ధి చెందుతుందన్నారు. అలాంటి సారునీరు అందించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. వేల క్యూసెక్యుల నీళ్లు సముద్రంలో కలుస్తున్న ప్రాజెక్టులు కట్టాలనే సోయి కాంగ్రెస్‌ నాయకులకు లేకపోయిందన్నారు. జానారెడ్డి ఒప్పందం లేదని.. ఆ పార్టీ అధ్యక్షుడు ఒప్పందం ఉందని ఆ పార్టీ నాయకుల్లోనే స్పష్టత లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మాజీ అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, ఈజీఎస్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కోట్లకిషోర్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, కష్ణముదిరాజ్, శివన్న తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement