మండలానికో స్టేడియం నిర్మించాలి: జితేందర్‌రెడ్డి | playing stadiums shold be build in every mandal: jitender reddy | Sakshi
Sakshi News home page

మండలానికో స్టేడియం నిర్మించాలి: జితేందర్‌రెడ్డి

Published Wed, Apr 22 2015 3:03 AM | Last Updated on Thu, Aug 9 2018 8:30 PM

మండలానికో స్టేడియం నిర్మించాలి: జితేందర్‌రెడ్డి - Sakshi

మండలానికో స్టేడియం నిర్మించాలి: జితేందర్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మండలానికొక ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలను నిర్మించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్ర క్రీడల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం క్రీడలకు ప్రోత్సాహం అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారిణులు క్రీడల్లో ముఖ్యభూమిక నిర్వహిస్తున్నారని టాప్ ర్యాంకర్లుగా ఉన్న సైనా నెహ్వాల్, సానియా మీర్జాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2024 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చేలా చొరవచూపాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోన్వాల్.. అన్ని రాష్ట్రాల క్రీడా మంత్రులు, జాతీయ క్రీడల సమాఖ్య కార్యవర్గం, ఒలింపిక్ సంఘాలతో  సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement