sarbananda sonval
-
అస్సాంలో కాషాయ రెపరెపలు
గువాహటి: ఎగ్జిట్‌పోల్స్‌అంచనాలను నిజంచేస్తూ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎన్డీఏకు స్వల్పంగా సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీ 59 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ 9 చోట్ల, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 6 సీట్లలో గెలుపొందాయి. ప్రముఖుల హవా... సీఎం సర్బానంద సోనోవాల్, వైద్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ, ఏజీపీ చీఫ్, మంత్రి అతుల్ బోరా వరుసగా మజులీ, జాలుక్‌బరి, బోకాఖాట్ నియోజకవర్గాల నుంచి ఘన విజయం సాధించారు. తమ సుపరిపాలనకు మెచ్చే ప్రజలు మరోసారి పాలన సాగించాలని ఎన్డీఏకు అవకాశం ఇచ్చారని సోనోవాల్ వ్యాఖ్యానించారు. మంత్రి హిమంతా బిశ్వా శర్మ లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు ఇది వరుసగా ఐదో గెలుపు. పటచార్‌కుచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజీత్ దాస్... ఏజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పబీంద్ర దేకాపై గెలిచారు. కాంగ్రెస్‌కు మళ్లీ తప్పని ఓటమి... కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 51 సీట్లకే పరిమితమై మరోసారి అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ 30 సీట్లను గెలుచుకోగా మహాకూటమిలోని మిగతా పార్టీలైన ఏఐయూడీఎఫ్ 16 సీట్లలో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లలో, సీపీఎం ఒక చోట గెలిచాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రిపుణ్ బోరా తన పదవికి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే భారీ మూల్యం చెల్లించుకుందని, ఎన్డీఏ గెలిచేందుకు ఇదే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుడు రాజన్ పాండే పేర్కొన్నారు. బీజేపీ సైతం అభ్యర్థుల తొలి జాబితా విడుదలలో పొరపాట్లు చేసినా ఆ తర్వాత విడుదల చేసిన జాబితాలలో ఆ తప్పుల ను సరిదిద్దుకుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామనే హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో ఓట్లు పొందలేకపోయిందన్నారు. -
అస్సాంలో వరదలు..ఐదుగురి మృతి
గువాహటి : ఒకపక్క కరోనా వైరస్, ఆఫ్రికన్ ఫ్లూతో ప్రజలు అల్లాడుతుంటే వరదల రూపంలో మరో పిడుగు పడినట్లయ్యింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది. రాష్ర్టంలోని నల్బరి, గోల్పారా, నాగావ్, హోజాయ్ సహా మరో మూడు జిల్లాలు ముంపునకు గురయ్యారు. దీంతో వరదల్లో చిక్కుకుపోయిన దాదాపు 3.81 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎఎస్‌డిఎంఎ) తెలిపింది. వరదల కారణంగా ముఖ్యంగా గోల్పురా, హోజాయ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం కాగా గురువారం ఈ రెండు జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అస్సాంలో వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర, దాని అనుబంధ ఉపనదుల్లో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. 356 గ్రామాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో 3,880 మందిని 190 సహాయక శిబిరాలకు చేర్చినట్లు తెలిపారు. (జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం ) వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆదేశించారు. వరద సమయంలో సత్వర ఉపశమనం, సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమీషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్న ఆయన బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వరదల నేపథ్యంలో కరోనా ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలంతా కలిసికట్టుగా విపత్తును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. (ఏడాది పాలన: ప్రజలకు మోదీ లేఖ ) -
మండలానికో స్టేడియం నిర్మించాలి: జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మండలానికొక ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలను నిర్మించాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కేంద్ర క్రీడల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో మంగళవారం క్రీడలకు ప్రోత్సాహం అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారిణులు క్రీడల్లో ముఖ్యభూమిక నిర్వహిస్తున్నారని టాప్ ర్యాంకర్లుగా ఉన్న సైనా నెహ్వాల్, సానియా మీర్జాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2024 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చేలా చొరవచూపాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోన్వాల్.. అన్ని రాష్ట్రాల క్రీడా మంత్రులు, జాతీయ క్రీడల సమాఖ్య కార్యవర్గం, ఒలింపిక్ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.