సీఎం మనవడు తినే బియ్యమే హాస్టల్‌ పిల్లలకు | MP Jithender Reddy of the TRS speaks on RTE Amendment Bill | Sakshi
Sakshi News home page

సీఎం మనవడు తినే బియ్యమే హాస్టల్‌ పిల్లలకు

Published Thu, Jul 19 2018 5:23 AM | Last Updated on Thu, Aug 9 2018 8:30 PM

MP Jithender Reddy of the TRS speaks on RTE Amendment Bill - Sakshi

ఏపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య

సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మనవడు తినే నాణ్యమైన బియ్యాన్నే గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్నారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి అన్నా రు. ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టాన్ని సవరిస్తూ డిటెన్షన్‌ విధానాన్ని విస్తృత పరిచేందుకు బుధవారం లోక్‌సభలో తెచ్చిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఐదో తరగతిలో ఉత్తీర్ణత సాధించకుంటే పైతరగతిలో ప్రవేశానికి అనర్హుడిని చేసే నిబంధనను తొలగించాలని కోరారు. స్కూళ్లలో మౌలిక వసతుల లేమి చిన్నారులను తీవ్రంగా వేధిస్తోందని తెలిపారు.

భువనగిరి, ఆలేరుల్లోరైళ్లు ఆపండి: బూర
సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి, ఆలేరు, జనగామలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ఈఅంశాన్ని లేవనెత్తారు. దీనిపై నాలుగేళ్లుగా అడుగుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రాంతంలో జైన మందిరం, యాదాద్రి పుణ్యక్షేత్రం, ప్రాచీన చర్చి ఉం దని పేర్కొన్నారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరి, ఆలేరు స్టేషన్లలో, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జనగామ స్టేషన్‌లో ఆపాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement