bura narsaiahgoud
-
సీఎం మనవడు తినే బియ్యమే హాస్టల్ పిల్లలకు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మనవడు తినే నాణ్యమైన బియ్యాన్నే గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి అన్నా రు. ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టాన్ని సవరిస్తూ డిటెన్షన్ విధానాన్ని విస్తృత పరిచేందుకు బుధవారం లోక్‌సభలో తెచ్చిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఐదో తరగతిలో ఉత్తీర్ణత సాధించకుంటే పైతరగతిలో ప్రవేశానికి అనర్హుడిని చేసే నిబంధనను తొలగించాలని కోరారు. స్కూళ్లలో మౌలిక వసతుల లేమి చిన్నారులను తీవ్రంగా వేధిస్తోందని తెలిపారు. భువనగిరి, ఆలేరుల్లోరైళ్లు ఆపండి: బూర సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి, ఆలేరు, జనగామలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ఈఅంశాన్ని లేవనెత్తారు. దీనిపై నాలుగేళ్లుగా అడుగుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రాంతంలో జైన మందిరం, యాదాద్రి పుణ్యక్షేత్రం, ప్రాచీన చర్చి ఉం దని పేర్కొన్నారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరి, ఆలేరు స్టేషన్లలో, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జనగామ స్టేషన్లో ఆపాలని కోరారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని ఎన్ని శక్తులు ప్రయత్నించినా.. వాటిని అధిగమించి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. -
వర్గీకరణతో అట్టడుగు వర్గాలకు న్యాయం
ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఓబీసీ కేటగిరీలో ఉప వర్గీకరణ వల్ల బీసీల్లోని అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అభిప్రాయపడ్డారు. వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం తెలంగాణలో ఇప్పటికే అమలవుతోందని పేర్కొన్నారు. అలాగే క్రీమీలేయర్ కేటగిరీలో ఆదాయ పరిమి తిని రూ. 6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లు 20 ఏళ్లుగా అమలవుతున్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఓబీసీల సంఖ్య 15 శాతం కూడా దాటక పోవడం శోచనీయ మన్నారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.