Free compulsory education
-
భారత్‌లో అద్భుతాలు ఆశించొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద విద్యార్థులందరికీ విద్యాహక్కు చట్టం కింద ఉచిత నిర్బంధ విద్య అందించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు స్పందించింది. భారత్ లాంటి పెద్దదేశంలో అద్భుతాలను ఆశించవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2015–16 మధ్యకాలంలో భారత్‌లో చదువుకు దూరంగా ఉన్న 3.68 కోట్ల మందిని విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ ‘అఖిల్ ఢిల్లీ ప్రాథమిక్ శిక్షక్ సంఘ్’ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9.5 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, దీనివల్ల చాలా పాఠశాలలు మూతపడుతున్నాయని వెల్లడించింది. -
సీఎం మనవడు తినే బియ్యమే హాస్టల్ పిల్లలకు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం కె.చంద్రశేఖర్‌రావు మనవడు తినే నాణ్యమైన బియ్యాన్నే గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి అన్నా రు. ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టాన్ని సవరిస్తూ డిటెన్షన్ విధానాన్ని విస్తృత పరిచేందుకు బుధవారం లోక్‌సభలో తెచ్చిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఐదో తరగతిలో ఉత్తీర్ణత సాధించకుంటే పైతరగతిలో ప్రవేశానికి అనర్హుడిని చేసే నిబంధనను తొలగించాలని కోరారు. స్కూళ్లలో మౌలిక వసతుల లేమి చిన్నారులను తీవ్రంగా వేధిస్తోందని తెలిపారు. భువనగిరి, ఆలేరుల్లోరైళ్లు ఆపండి: బూర సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి, ఆలేరు, జనగామలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ఈఅంశాన్ని లేవనెత్తారు. దీనిపై నాలుగేళ్లుగా అడుగుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రాంతంలో జైన మందిరం, యాదాద్రి పుణ్యక్షేత్రం, ప్రాచీన చర్చి ఉం దని పేర్కొన్నారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను భువనగిరి, ఆలేరు స్టేషన్లలో, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జనగామ స్టేషన్లో ఆపాలని కోరారు. -
నియోజకవర్గానికో ఉపవిద్యాధికారి
మంచిర్యాల సిటీ : ఉచిత నిర్బంధ విద్యను పటిష్టంగా అమలుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా పర్యవేక్షణపై మొదటగా దృష్టి సారించింది. పర్యవేక్షణ పకడ్బందీగా లేనిదే మెరుగైన విద్యనందించడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో శాసనసభ నియోజకవర్గానికో ఉప విద్యాధికారిని నియమించాలని భావిస్తోంది. విద్యాశాఖలో అడ్డగోలుగా ఖాళీలు ఉండడంతో ప్రాథమిక విద్య అడుగుంటిపోతోందని ఉపాధ్యాయ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ఒక్క జిల్లా విద్యాధికారితోపాటు ముగ్గురు మండల విద్యాధికారులే శాశ్వత అధికారులుగా పని చేస్తున్నారు. 49 మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలే ఉన్నారు. పెరుగనున్న పోస్టులు జిల్లాలో ప్రస్తుతానికి మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఇద్దరు ఇన్చార్జి డెప్యూటీ ఈవోలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున భర్తీ చేస్తే.. 10 నియోజకవర్గాలకు పది మంది ఉపవిద్యాధికారులు నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నియోజక వర్గాలు పెంచాలని సీఎం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. నియోజకవర్గాలు పెరిగితే అందుకు అనుగుణంగా మరిన్ని పోస్టులూ పెరుగుతాయి. తగ్గనున్న భారం నియోజకవర్గానికో ఉప విద్యాధికారి నియామకమైతే వారికి భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్నవారు 20కి పైగా మండలాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షించడం ఒక్కరితో సాధ్యం కాదు. నియోజకవర్గానికి ఒకరిని నియమిస్తే పరిపాలన సులభమవుతుంది. విద్యార్థులకు మెరుగైన విద్య అందే అవకాశాలు ఉంటాయి. సర్వశిక్ష అభియాన్‌కు విద్యాశాఖ అధికారులే.. సర్వశిక్ష అభియాన్‌కు ఇన్నేళ్లుగా విద్యాశాఖకు సంబంధం లేని అధికారులే ప్రాజెక్టు అధికారులుగా నియమితులయ్యేవారు. కేంద్రం ఆదేశాల ప్రకారం పీవో పోస్టులు డీఈవో అజమాయిషీలోనే ఉండాలి. నాలుగేళ్ల కిందట ఈ విధానానికి స్వస్తి పలికింది. ఇతర విభాగాలకు చెందిన అధికారులను నియమించడంతో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులనే నియమించి ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నాలుగేళ్ల కిందటి మాదిరిగా అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.