న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద విద్యార్థులందరికీ విద్యాహక్కు చట్టం కింద ఉచిత నిర్బంధ విద్య అందించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు స్పందించింది. భారత్ లాంటి పెద్దదేశంలో అద్భుతాలను ఆశించవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2015–16 మధ్యకాలంలో భారత్‌లో చదువుకు దూరంగా ఉన్న 3.68 కోట్ల మందిని విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ ‘అఖిల్ ఢిల్లీ ప్రాథమిక్ శిక్షక్ సంఘ్’ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9.5 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, దీనివల్ల చాలా పాఠశాలలు మూతపడుతున్నాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment