
రాష్ట్ర పథకాలకు కేంద్రం సాయం చేయాలి
లోక్‌సభలో ఎంపీ జితేందర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలకు కేంద్రం సాయం చేయాలని ఎంపీ జితేందర్‌రెడ్డి కోరారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీకి కేంద్రం సహకరించాలని కోరారు.
కేంద్రం ఇటీవల ఆమోదించిన జాతీయ ఆర్యోగ పాలసీలో ఆశావర్కర్ల ప్రయోజనాలను విస్మరించిందని ప్రత్యేక ప్రస్తావన కింద ఎంపీ వినోద్ కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. గర్భిణీలు.. ప్రసవించే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే ఆశావర్కర్లకు రాయితీ రావడం లేదని పేర్కొన్నారు. ఆశావర్కర్లకు రాయితీలు పెంచి వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు.