రైతు సంక్షేమమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యం
రైతు సంక్షేమమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యం
Published Sat, Mar 25 2017 11:23 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ చౌదరి
మార్కెట్‌యార్డులో రైతు సంజీవిని ఆసుపత్రి ప్రారంభం
కర్నూలు(వైఎస్‌ఆర్ సర్కిల్): రైతుల సంక్షేమమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ లక్ష్యమని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. యార్డుకొచ్చే ప్రతి రైతుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దిగుబడులు విక్రయించేందుకు యార్డుకు వచ్చిన రైతులకు వైద్యసేవలు అందించడం కోసం స్థానికంగా రైతు సంజీవి పేరుతో ఉచిత వైద్య ఆసుపత్రి ఏర్పాటు చేశారు. దీన్ని శనివారం కృష్ణాపురానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం యార్డు ప్రత్యేక కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఏడీఎం మాట్లాడుతూ యార్డులో ఆహ్లాదాన్ని అందించే విధంగా పచ్చని మొక్కలను నాటే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ యార్డుకొచ్చే రైతులకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ప్రాథమిక వైద్యం అందించేందుకు ఈ వైద్యశాల దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో యార్డు సహాయ కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, శివప్ప, సూపర్‌వైజర్లు రెహమాన్, ఈశ్వర్‌రెడ్డి, రామదాసు, రిటైర్డ్ జేడీ నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
300 మంది రైతులకు ఉచిత వైద్యపరీక్షలు:
రైతు సంజీవిని వైద్యశాలలో ప్రారంభోత్సవ రోజున డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి 300 మంది రైతులను పరీక్షించారు. బీపీ, షుగర్‌తో పాటు పలు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశౠరు.
స్వచ్ఛమార్కెట్ :
ఏడీఎం సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో శనివారం యార్డులో స్వచ్ఛమార్కెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మొత్తం యార్డు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు.
Advertisement
Advertisement