yard
-
క్వింటా పత్తి రూ. 7,711
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర రూ.7,711గా నమోదైంది. గత వారంలో రూ.7,500 ధర ఉండగా.. ఈ వారం రోజురోజుకు రూ.50, రూ.100 చొప్పున పెరుగుతూ రూ.7,711కు చేరుకుంది. శుక్రవారం మార్కెట్‌కు 2,626 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ట ధర రూ.7,711, మధ్య ధర రూ.7,389, కనిష్ట ధర రూ.5,169 పలికింది. అలాగే, వేరుశనగ 1,437 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,969, కనిష్ట ధర రూ.3,849.. ఆముదాలకు గరిష్ట ధర రూ.5,475, కనిష్ట ధర రూ.4,500, పూల విత్తనాలకు గరిష్ట ధర రూ.4,212, కనిష్ట ధర రూ.3,926 లభించింది. -
కొబ్బరికాయలతో గణనాథుడు
-
ఏపీలో మార్కెట్ యార్డులు పునః ప్రారంభం
-
సూట్‌పేరుతో మోసం చేస్తే చర్యలు
యార్డు సెక్రటరీల సమీక్షలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ అనంతపురం అగ్రికల్చర్: రైతుబంధు పథకం అమలు, ఫీజు వసూళ్ల సాధనలో మార్కెటింగ్‌శాఖ పనితీరు బాగోలేగని జేసీ–2 ఖాజా మొహిద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్థానిక మార్కెటింగ్‌శాఖ ఏడీ కార్యాలయంలో ఏడీ హిమశైలతో కలిసి మార్కెట్‌యార్డు సెక్రటరీలు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వెన్నుదున్నుగా నిలవడంలో మార్కెటింగ్‌శాఖ కీలక భూమిక పోషించాల్సి ఉందన్నారు. అయినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. చీనీ, ఇతర పండ్ల ఉత్పత్తులు పండిస్తున్న రైతులను సూట్లు (తరుగు) పేరుతో వ్యాపారులు, దళారులు మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నందున... తక్షణం నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను మోసం చేసే వారిపై మార్కెటింగ్, పోలీసు చట్టాలు ప్రయోగించి శిక్షించాలని ఆదేశించారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.2.86 కోట్లు కేటాయించినా కేవలం రూ.11.24 లక్షలు మాత్రమే ఖర్చు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో 13 మార్కెట్‌యార్డుల ద్వారా రూ.14.11 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యం నిర్దేశించుకోగా... ఇప్పటివరకు కేవలం రూ.3.14 కోట్లు వసూలైందన్నారు. అందులోనూ తనకల్లు, ధర్మవరం, రాయదుర్గం లాంటి కొన్ని యార్డుల్లో వసూళ్లు బాగా పడిపోవడంపై కారణాలు ఆరాతీశారు. రానున్న రోజుల్లో ఆకస్మిక తనిఖీల్లో కొనసాగిస్తామని, పనితీరు మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
రైతు సంక్షేమమే మార్కెటింగ్‌శాఖ లక్ష్యం
అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ చౌదరి మార్కెట్‌యార్డులో రైతు సంజీవిని ఆసుపత్రి ప్రారంభం కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): రైతుల సంక్షేమమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ లక్ష్యమని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ చౌదరి పేర్కొన్నారు. యార్డుకొచ్చే ప్రతి రైతుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. దిగుబడులు విక్రయించేందుకు యార్డుకు వచ్చిన రైతులకు వైద్యసేవలు అందించడం కోసం స్థానికంగా రైతు సంజీవి పేరుతో ఉచిత వైద్య ఆసుపత్రి ఏర్పాటు చేశారు. దీన్ని శనివారం కృష్ణాపురానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం యార్డు ప్రత్యేక కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ఏడీఎం మాట్లాడుతూ యార్డులో ఆహ్లాదాన్ని అందించే విధంగా పచ్చని మొక్కలను నాటే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ యార్డుకొచ్చే రైతులకు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ప్రాథమిక వైద్యం అందించేందుకు ఈ వైద్యశాల దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో యార్డు సహాయ కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, శివప్ప, సూపర్వైజర్లు రెహమాన్, ఈశ్వర్‌రెడ్డి, రామదాసు, రిటైర్డ్ జేడీ నారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 300 మంది రైతులకు ఉచిత వైద్యపరీక్షలు: రైతు సంజీవిని వైద్యశాలలో ప్రారంభోత్సవ రోజున డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి 300 మంది రైతులను పరీక్షించారు. బీపీ, షుగర్‌తో పాటు పలు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశౠరు. స్వచ్ఛమార్కెట్ : ఏడీఎం సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో శనివారం యార్డులో స్వచ్ఛమార్కెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మొత్తం యార్డు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. -
ఆదోని యార్డులో రూ.10.5 కోట్ల వ్యాపారం
ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం రికార్డు స్థాయిలో వ్యవసాయ దిగుబడుల వ్యాపారం జరిగింది. దాదాపు రూ.10.55 కోట్ల దిగుబడులు అమ్మకానికి వచ్చినట్లు అంచనా. యార్డు చరిత్రలో ఒకే రోజు ఈ స్థాయిలో క్రయ, విక్రయాలు జరగడం ఇదే ప్రథమం. అత్యధికంగా పత్తి దిగుబడులు 18,448 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలు రూ.4050– రూ.5670 మధ్య ధర పలికింది. మోడల్ ధర రూ.5419గా రికార్డయింది. ఈ లెక్కన పత్తి వ్యాపారమే రూ.9.9కోట్లకుపైగా సాగినట్లు వ్యాపార వర్గాలు అంచనా. మిగతా వాటి మోడల్ ధరను తీసుకుంటే వేరుశనగ రూ.4492, ఆముదం రూ.2912 పలికింది. మొత్తంగా రూ.10.55 కోట్లు వ్యాపారం జరిగినట్లు యార్డు అధికారులు తెలిపారు. అయితే టెండర్లు ఖరారులో జాప్యం కారణంగా పత్తి తూకాలు సగానికి పైగా శుక్రవారానికి వాయిదా పడ్డాయి. -
బామ్మ మాటా బంగారు బాట
డబ్బు సంపాదించడమనేది కష్టం కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఖర్చులు, మారిపోతున్న జీవన విధానాల కారణంగా సంపాదించిన డబ్బును, సంపదను జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రం కష్టమే. ఇందుకోసం రకరకాల ప్లానింగ్‌లు వేస్తాం .. వాళ్లనీ, వీళ్లనీ సలహాలు అడుగుతుంటాం. వాళ్లూ, వీళ్లూ చెప్పినవి అమలు చేయడానికి ప్రయత్నించి, వర్కవుట్ కాక.. చేతులెత్తేసి..ఇహ ఇంతే అని సరిపెట్టేసుకుంటాం. అయితే, ఈ క్రమంలో వాళ్లూ.. వీళ్లూ కాకుండా .. మన బామ్మలు, తాతయ్యలు చెప్పిన, పాటించిన భేషైన ఆర్థిక సూత్రాలను మాత్రం మనం లెక్క చేయం. వాళ్లు చెప్పేదేముంది.. అంతా పాతచింతకాయ పచ్చడి లెక్కలు, పెరటి వైద్యం పనికి రాదంటూ కొట్టి పారేస్తుంటాం. కొన్ని విషయాల వరకూ ఇదీ ఓకే అనుకున్నా, ముఖ్యమైన ఆర్థిక అంశాల్లో బామ్మలు, తాతయ్యలు పాటించిన సూత్రాలు అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఎవర్‌గ్రీనే. వాళ్లకి పని చేస్తాయి.. వీళ్లకు పనిచేయవంటూ లేకుండా.. అందరికీ వర్కవుట్ అయ్యేవే. అలాంటి వాటిల్లో కొన్నింటి సమాహారమే ఈ కథనం. ఆదాయాన్ని బట్టే బడ్జెట్... ఇది చెప్పడం సులువే కానీ పాటించడమే చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇది సాధ్యమే. మనకి ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చు చేస్తున్నాము.. ఇందులో అచ్చమైన అవసరాలేంటి.. పక్కన పెట్టినా చల్తా హై లాంటి లైఫ్ స్టయిల్ ఖర్చులేమిటి లాంటివి లెక్క వేసుకుని, ఒక బడ్జెట్ తయారు చేసుకుని, దానికి కట్టుబడి ఉండగలిగితే చాలు. ఒకవేళ అదనంగా ఆదాయం వచ్చినా, దాన్ని బడ్జెట్లో కలపకుండా భవిష్యత్ అవసరాల కోసం పక్కన పెట్టేయడం అలవర్చుకోవడం మంచిది. ఇంటి ఖర్చులకు పది రూపాయలే ఉన్నా .. బామ్మలు తమ కాలంలో గంపెడు సంసారాలను గుట్టు చప్పుడు కాకుండా నెట్టుకురాగలిగారంటే కొండొకచో ఇలాంటి ప్లానింగ్ వల్లే. ఫుల్లుగా వాడకం.. ఇది కొంటే అది ఫ్రీ అని.. అది కొంటే మరొకటి ఫ్రీ అని.. అరవై రూపాయలది అర్ధ రూపాయికొస్తోందని.. అవసరమైనవి, అనవసరమైనవి అడ్డదిడ్డంగా కొనిపారేస్తుంటాం. వాటిని కనీసం ఒక్కసారైనా వాడకుండానే మళ్లీ కొత్తవి కొనడానికి బైల్దేరుతుంటాం. దీనివల్ల అనవసరమైనవి ఇల్లంతా పేరుకుపోవడం, పర్సుకు చిల్లుపడటం తప్ప ప్రయోజనం లేదు. అదే బామ్మగారైతే మాత్రం కొన్నదాన్ని పూర్తిగా గిట్టుబాటు చేసేంత వరకూ మరొకటి కొనడానికి ఒప్పుకోదు. ఫలితంగా దుబారాను తగ్గిస్తుంది. పేస్టులు.. షాంపూలు మొదలుకుని మొబైల్ ఫోన్ల దాకా సేమ్ టు సేమ్. రోజుకో స్మార్ట్‌ఫోన్ వస్తోంది కదాని కొనేయనక్కర్లేదు. మన అవసరానికి అనుగుణంగా కొనుక్కున్నదాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించేసిన తర్వాతే కొత్త వాటివైపు చూడటం ఉత్తమం. రీసైక్లింగ్.. పర్యావరణాన్ని కాపాడేయాలనే తాపత్రయంతో రీసైకిల్డ్ బ్యాగులు, కవర్లు వంటివి కాస్త ఖర్చు ఎక్కువైనా అప్పుడప్పుడు కొనే స్తుంటాం. నలుగురికీ గొప్పగా చెప్పుకుంటాం. అదే సూత్రాన్ని మన ఇంట్లో పాటించాలంటే మాత్రం నామోషీ అడ్డం వస్తుంటుంది. నిజానికి బామ్మలు ఇంట్లో పాత చీరల్లాంటివాటితో బొంతలు వగైరాలు తయారు చేసినా.. చద్దన్నాన్ని పొద్దున్న రిపేరు చేసి వడ్డించినా.. ఏదీ వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే. లైఫ్‌స్టయిల్ మారిపోయిన ప్రస్తుత తరుణంలో మనమూ అచ్చం ఇలాంటివే చేయాలని లేదు కానీ పాతబడిపోయిన వాటన్నింటినీ బైటపారేయనక్కర్లేదు. కాస్త క్రియేటివిటీని జోడించి కొత్త రూపునిస్తే సరి. దీని వల్ల సదరు వస్తువును కొనాల్సిన అవసరం లేకుండగా.. క్రియేటివ్‌గా ఏదో ఒకటి చేశామన్న సంతృప్తి కూడా దక్కుతుంది. ఇంటి ఫుడ్డు.. ఫ్రీ టైము.. రెస్టారెంట్లలో తినడం అన్నది అప్పుడప్పుడైతే ఓకే గానీ తరచూ హోటల్ ఫుడ్డు మీదే ఆధారపడటం వల్ల ఇటు శరీరానికే కాదు అటు పర్సు ఆరోగ్యానికీ మంచిది కాదు. ఎంత ఉరుకులు పరుగుల లైఫ్‌లో ఉన్నా.. కొంత సమయం ఇంటి భోజనానికే కేటాయించగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆదాకి ఆదా కూడా. ఇక, ఇంటిపట్టునే ఉండాల్సి రావడం ఒక పనిష్మెంట్గా కాకుండా.. ఆ సమయాన్ని ఫ్రెండ్స్‌తో ఆడటంలోనో, కొత్తవి ఏవైనా నేర్చుకోవడంలోనో.. ఆదాయాన్ని పెంచగలిగే అవకాశాల గురించి తెల్సుకోవడానికో వెచ్చిస్తే నిర్మాణాత్మకంగా ఉంటుంది. రిఫ్రెషింగ్‌గా కూడా ఉంటుంది. పైగా ఈ రిఫ్రెష్మెంట్కి అదనంగా ఖర్చేమీ ఉండదు. ఏదైతేనేం.. దుబారా చేయకుండా, పొదుపుగా పద్ధతిగా ఉండటమంటే చీప్‌గా ఉండటమని కాదు అర్థం. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలన్నది తెలిసుండటం. ఖర్చుల విషయంలో స్మార్ట్‌గా వ్యవహరించడం.. భవిష్యత్ కోసం జాగ్రత్తపడటం. బామ్మ కాస్త చాదస్తంగా చెప్పినా... కాస్త హంగూ ఆర్భాటాలు.. పదాడంబరాలతో ప్లానర్లు చెప్పినా.. వినదగు ఫార్ములాలు దాదాపు ఇవే. అవసరమైన వాటిపైనే ఖర్చు.. బడ్జెట్లో చెప్పుకున్న దాంట్లో ఈ ఖర్చులే కీలకం. సంపద ఎంతైనా ఉండొచ్చు. ఉంది కదా అని.. కానీ దుబారా ఖర్చులు చేసినా, అయాచితంగా ఇచ్చేసినా కొండంత ఖజానా కూడా కరిగిపోతుంది. అలాగని అవసరమైన దగ్గర మరీ లోభిత్వం కూడా చేయకూడదు. చాన్నాళ్ల క్రితం ఒక ఊళ్లో బాగా సంపన్నురాలైన బామ్మ ఉండేది. సంపన్నురాలైనా కూడా వాళ్లింట్లో కరివేపాకు రెబ్బ కావాలన్నా పది పైసలు ఇస్తే గానీ ఇచ్చేది కాదు. అలాంటి ఇంట్లో ఒకసారి భారీ స్థాయిలో పెళ్లి జరిగింది. లక్షలు ఖర్చు పెట్టారు. పెళ్లిరోజున ఊరందరికీ ఒక్కరోజు విందు భోజనాలూ పెట్టారు. కానీ, ఆ మర్నాడు ఊరిజనం మళ్లీ యథాప్రకారం పది పైసలు కడితే గానీ కరివేపాకు రెబ్బ చేతికి రాలేదు. తద్వారా సందర్భానికి తగినట్లుగా ఖర్చు చేయడం, మిగతా సమయాల్లో స్ట్రిక్టుగా నియమాన్ని పాటించడం నేర్పిందా బామ్మగారు.