కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్:
మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల సమ్మెతో వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతన్నకు ఊరట లభించింది. సమ్మె ప్రభావాన్ని తగ్గిస్తూ జేఏసీ నాయకులు చర్యలు తీసుకున్నారు. దీంతో శనివారం నుంచి కర్నూలు మార్కెట్‌లో యథావిధిగా అమ్మకాలు కొనసాగనున్నాయి. సోమవారం నుంచి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలూ జరుగుతాయి. అయితే మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు మాత్రం సమ్మెలోనే ఉంటారు. అమ్మకాలకు సెక్యూరిటీ గార్డులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహకరిస్తారు. సీమాంధ్ర జిల్లాల జేఏసీ నేతలతో మార్కెట్ కమిటీ చైర్మన్ డి.వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ కోకన్వీనర్ చంద్రమోహన్‌రెడ్డి చర్చించారు. ఈ నెల 20 నుంచి మార్కెట్‌లు బంద్ కావడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీంతో సానుకూల ఫలితం వచ్చింది. రైతులను దృష్టిలో ఉంచుకుని సమ్మెకు సడలింపు ఇచ్చిన మార్కెటింగ్ శాఖ జేఏసీకి శుక్రవారం కమిటీ డెరైక్టర్ ఫరూక్ అహ్మద్, కమిషన్, కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్ చంద్రమోహన్‌రెడ్డి, డెరైక్టర్లు శేషగిరిశెట్టి, కటకం శాంతి స్వరూప్, కట్టా శేఖర్, కమిషన్ ఏజెంట్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి చర్యలు
ఆదోని: రైతుల సంక్షేమం కోసం ఈ నెల 30 నుంచి ఆదోని మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు యార్డు కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు. మార్కెట్‌లో దిగుబడుల ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవని, ప్రస్తుతం ఆయా దిగుబడుల ధరలు ఆశాజనకంగా ఉండడంతో వినియోగించుకోవాలని అన్నారు. ఆయా యార్డులలో అవుట్ సోర్సింగ్, ప్రొబిషనరీ ఉద్యోగులు సమ్మెలో లేరని, వారు రైతులకు సహకరిస్తారని తెలిపారు. రైతులు తమ దిగుబడులను సోమవారం నుంచి యార్డులోనే అమ్ముకోవచ్చని తెలిపారు.
రైతన్నకు ఊరట
Published Sat, Sep 28 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement