రోడ్డుపైనే ఉల్లి క్రయవిక్రయాలు
Published Fri, Sep 27 2013 12:44 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : మార్కెటింగ్ ఉద్యోగులు సమ్మె బాట పట్టడం, ఫలితంగా మార్కె ట్ యార్డు బంద్ కావడంతో ఆందోళన చెందుతున్న ఉల్లి రైతులు గురువారం రోడ్డుపైనే అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్ శాఖ అధికారులు, ఉద్యోగులతో సంబంధం లేకుండా పంట విక్రయాలు జరిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 20 నుంచి మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ఉల్లి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సహకరించాలని మార్కె ట్ కమిటీ చైర్మన్ డి.వెంకటేశ్వరరెడ్డి, డెరైక్టర్లు చేసిన విజ్ఞప్తి మేరకు మార్కెటింగ్ శాఖ ఉద్యోగులను ఈనెల 27 వరకు గడువు కోరారు.
అప్పటి వరకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైనే ఉల్లిని రాసులుగా పోసి అమ్ముకోవడం ప్రారంభించారు. మార్కెట్ యార్డు ఎదుట ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య సర్కి ల్ నుంచి వెంకటరమణ కాలనీకి వెళ్లే రోడ్డును ఉల్లితో నింపేశారు. కోడుమూరు రోడ్డులోని హనుమాన్ కాట తదితర ప్రాంతాల్లోనూ లాట్లుగా పోశా రు. ఉల్లికి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు, దళారీలు పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. రైతులకు నష్టమే.. : పండిన పంటను నిల్వ ఉంచుకుంటే కుళ్లిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు వచ్చినకాడికి మహాదేవ అంటూ రోడ్డుపైనే పోసి అమ్ముకుంటున్నారు.
దీంతో దళారులు, వ్యాపారు లు బాగుపడుతున్నారు. క్వింటాల్ ధర రూ.4 వేలకుపైగా ఉన్నప్పటికీ రూ.2500 నుంచి రూ. 3వేలకు మించి ధర లభించలేదు. మార్కెట్ యార్డులో వేలంపాట పద్ధతిన ఉల్లి క్రయ విక్రయాలు జరుగుతాయి. మార్కెట్‌కు సంబంధం లేకుండా రోడ్డుపై క్రయ విక్రయాలు అనామత్‌పైనే జరిగాయి. ఉల్లి డిమాండ్ తగ్గింది.. ఈ రేటుకైతే ఓకే.. ఇస్తావా ఇవ్వవా అంటూ రైతులను ఆందోళనకు గురి చేసి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. రోడ్డుపై ఒక్కరోజే దాదాపు 2 వేల క్వింటాళ్ల విక్రయాలు జరిగినట్లు తెలిసింది. మార్కెటింగ్ ఉద్యోగుల జేఏసీ కో కన్వీనర్ చంద్రమోహన్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ‘రోడ్డుపై జరిగే క్రయ విక్రయాలతో మాకు సంబంధం లేదు. సమ్మెలో ఉన్నాం. పట్టించుకోం’ అని తెలిపారు.
Advertisement
Advertisement