
వ్యాపారవేత్తగా ఎదగడం ఎలా..
డబ్బు సంపాదించడం ఎలా, వ్యాపారవేత్తగా ఎదగడం ఎలా అనేది తెలియజేసే టాప్ పుస్తకాల్లో కొన్నింటితో ఇటీవలే ఒక వార్తా సంస్థ ఒక లిస్టు తయారు చేసింది. వీలుంటే ఒకసారి మీరూ తిరగెయ్యండి..
డబ్బు సంపాదించడం ఎలా, వ్యాపారవేత్తగా ఎదగడం ఎలా అనేది తెలియజేసే టాప్ పుస్తకాల్లో కొన్నింటితో ఇటీవలే ఒక వార్తా సంస్థ ఒక లిస్టు తయారు చేసింది. వీలుంటే ఒకసారి మీరూ తిరగెయ్యండి..
వాట్ వుడ్ యాపిల్ డు?
రచయిత: డిర్క్ బెక్‌మాన్
పబ్లిషర్: జైకో,
పేజీలు: 184
ధర: రూ. 299
సాంప్రదాయ వ్యాపార మెళకువలతో డిజిటల్ యుగంలో యాపిల్ కంపెనీ అవకాశాలను ఏ విధంగా చేజిక్కించుకున్నదీ తెలియజేస్తుందీ పుస్తకం. కొంగొత్త ఐడియాల రూపకల్పనతో పాటు విజయవంతంగా వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చన్నదీ యాపిల్ పాఠాలతో వివరిస్తుంది.
ఇన్నోవేషన్ సూత్ర
రచయిత: రేఖా షెట్టి,
పబ్లిషర్: పోర్ట్‌ఫోలియో
పేజీలు: 212,
ధర: రూ. 250
ధర్మ అనే విజయవంతమైన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకరు.. తాను నిర్మించుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోతే.. మళ్లీ ఏ విధంగా పునర్నిర్మించుకున్నాడన్నది తెలియజేసే బుక్ ఇది. భిన్నంగా ఆలోచించడం, బుద్ధుని బోధనలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి సంబంధించి ప్రాచీన భారతీయ సంస్కృతి నేర్పిన పాఠాలు, నైతికంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూనే లాభాలను ఆర్జించడం ఎలాగనేది వివరిస్తుందీపుస్తకం.
ది బక్స్ స్టాప్స్ హియర్
రచయిత: ఆశుతోష్ గర్గ్, పబ్లిషర్: రూప, పేజీలు: 188, ధర: రూ. 250
గార్డియన్ లైఫ్‌కేర్ అనే ఫార్మసీ సంస్థను స్థాపించడం మొదలుకొని కోట్ల రూపాయల బిజినెస్‌గా మల్చడం దాకా ప్రస్థానాన్ని గురించి కంపెనీ వ్యవస్థాపకుడు ఆశుతోష్ గర్గ్ రాసిన పుస్తకం ఇది. కలలను సాకారం చేసుకునేందుకు, సవాళ్లను అధిగమించేందుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిల్చేది.