సుభాష్‌నగర్ (నిజామాబాద్) : ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో క్రయ విక్రయాలను నిలిపేస్తున్నట్లు మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంప శ్రీనివాస్‌గుప్త తెలిపారు. కమీషన్ ఏజెంట్లు వ్యాట్ చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బంద్‌కు వెళ్లనున్నట్టు చెప్పారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు తీర్మానం చేశారు. ధాన్యం కొనుగోలుదారులు ఇప్పటికే 4 శాతం వ్యాట్‌ను వాణిజ్యపన్నుల శాఖకు చెల్లిస్తున్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా కమీషన్ ఏజెంట్లు సైతం వ్యాట్ చెల్లించాలనడం హాస్యాస్పదమని శ్రీనివాస్ గుప్తా అన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలను నిలిపేయాలని రాష్ట్ర కమిటీలో నిర్ణయించినట్లు తెలిపారు.
16 నుంచి మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు బంద్
Published Fri, May 13 2016 7:42 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement