సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆమె ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాస్తవ్ మూవీ నమ్రత కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత నమ్రతకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.
ఇక తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా వంశీ. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మహేశ్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2005, ఫిబ్రవరి 10న ముంబైలో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.అయితే వీరి పెళ్లి జరగడానికి మహేశ్ సోదరి మంజుల ముఖ్య పాత్ర వహించారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మంజలతో తనకున్న రిలేషన్‌ను షేర్ చేసుకున్నారు.
చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..
'ఓ పార్టీలో అనుకోకుండా మంజులను కలిశాను. అప్పుడు నేను మహేశ్‌ను ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ అయ్యాం. తను నా బెస్ట్‌ఫ్రెండ్. అంతేకాదు. మేమిద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సీని ధరించడం యాధృచ్చికంగా జరిగింది. నిజానికి మంజులకు పిల్లలను కనడం మొదట్లో ఇష్టమే లేదు. కానీ ఇప్పుడో కూతురు. తల్లిగా ఆమె ఎంతో ఆనందిస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పినందుకు తనకెలాంటి బాధ లేదని, స్తుతం తన ఫ్యామిలీని చూసుకోవడంలో బిజీగా ఉన్నానంటూ తెలిపారు. అందుకే ప్రస్తుతానికి సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: అందుకే సావిత్రిపై కృష్ణకుమారికి కోపం..చనిపోయినా వెళ్లలేదు!
Comments
Please login to add a commentAdd a comment