సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే! వంశీ(2000) సినిమాతో మొదలైన వీరి స్నేహం సినిమా ముగిసేసరికల్లా ప్రేమగా మారింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా వీరి మనసులను మాత్రం ఒక్కటి చేసింది. ముందు నమ్రత తన మనసులోని ప్రేమను బయటపెట్టగా.. అప్పటికే తనపై చెప్పలేనంత ప్రేమను దాచుకున్న మహేశ్ వెంటనే ఓకే చెప్పాడు. పెద్దలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది నమ్రత.
షాపింగ్ అంటే ఇష్టముండదే!
పిల్లలు సితార, గౌతమ్‌లను చూసుకోవడంతో పాటు మహేశ్ బిజినెస్ వ్యవహారాలు సైతం చూసుకుంటూ ఉంటుంది. తాజాగా ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లిన నమ్రత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నాకు పెద్దగా నగలేమీ ఇష్టముండదు. చాలావరకు సింపుల్‌గానే ఉండటాన్ని ఇష్టపడతాను. షాపింగ్ కూడా అంత ఇష్టముండదు. మహేశ్‌బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి వెడ్డింగ్ రింగ్.
ఇప్పటికీ అది నాతోనే
నేను ఇప్పటివరకు అందుకున్న ఉత్తమమైన బహుమతుల్లో ఒకటి మా అమ్మ ఇచ్చిన బంగారు ఉంగరం. 8 ఏళ్ల వయసులో అమ్మ నాకు సాయిబాబా ఉంగరం ఇచ్చింది. ఇప్పటికీ నేను దాన్ని ధరిస్తున్నాను. ఇకపోతే మహేశ్‌బాబుతో కలిసి నటించబోతున్నా, రీఎంట్రీ ఇవ్వనున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలే సితార ఓ గోల్డ్ యాడ్ షూటింగ్‌లో పాల్గొని అందరినీ సర్‌ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే! ఆ యాడ్‌కు సంబంధించిన చిత్రాలను న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఇది చూసి మహేశ్‌బాబు ఎంతగానో సంతోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment