సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్‌లతో ఫుల్ బిజీగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్‌కు వెళ్తుంటారు. తాజాగా మహేశ్ కుటుంబం లండన్ ట్రిప్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, కాసేపటికే అవి వైరల్‌గా మారాయి.
ఇందులో మహేశ్ న్యూలుక్‌తో కనిపించారు. కాగా సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment