
త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన వరకు భారీగా బజ్ క్రియేట్ అయింది. రికార్డు స్థాయిలో విడుదలకు రెడీగా ఉన్న గుంటూరు కారం ట్రైలర్ మరికొంత సమయంలో విడుదల కానుంది. మరోవైపు ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని గంటల్లో ట్రైలర్ విడుదల కానున్నడంతో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఒక ఫ్యాన్ బేస్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో నేడు గుంటూరు కారం ట్రైలర్ విడుదల కానుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు అక్కడ ఏర్పాటు చేశారు. దారి వెంట పోస్టర్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమన్ మ్యూజిక్‌కు స్టెప్పులేస్తూ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
సుదర్శన్ థియేటర్ వద్ద మహేశ్ బాబు భారీ కటౌట్‍ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ హంగామా మొదలైంది. జనవరి 12న గుంటూరు కారం సినిమా చూసేందుకు వారందరూ సుదర్శన్ థియేటర్‌కు వస్తున్నట్లు నమ్రత తెలిపారు. గుంటూరు కారం చిత్రం నుంచి ఇటీవల వచ్చిన 'కుర్చీని మడతపెట్టి' సాంగ్ విపరీతంగా పాపులర్ అయింది. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీల ఊర నాటు స్టెప్‍లు అదిరిపోయాయి. థియేటర్లో ఈ పాట చూస్తే సూపర్ స్టార్ అభిమానులకు పూనకాలే..
Comments
Please login to add a commentAdd a comment