
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కొద్దిరోజుల క్రితం జర్మనీ వెళ్లారు. గుంటూరు కారం సినిమా విడుదల తర్వాత ఆయన ఆక్కడకు వెళ్లడం జరిగింది. జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ 'హ్యారీ కొనిగ్'ను మహేష్ కలుసుకున్నారు. ఆయన బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన డాక్టర్. ఆయన్ను ఇప్పటికే పలుమార్లు కలుసుకున్న మహేశ్.. ప్రస్తుతం ఆయనతో పాటుగా జర్మనీ అడవుల్లో ట్రావెల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ ఫొటోలను ఆయన షేర్ చేశారు.
జర్మనీలోని బాడెన్ ప్రాంతంలో మహేశ్, తన ఫిట్నెస్ డాక్టర్ హ్యారీ కొనిగ్‌తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ పర్వతంపై ట్రెక్కింగ్ చేశారు. గడ్డ కట్టించే చలిలో డాక్టర్ హ్యారీతో కలిసి మహేశ్ పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. ట్రెక్కింగ్ విషయం గురించి చెబుతూ మహేష్ ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం మహేశ్ ఇలా కష్టపడుతున్నారని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి-మహేశ్ సినిమా SSMB29 ఎక్కువగా అటవి ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫోటోలను చూసిన ఆయన సతీమణి నమ్రత.. 'నిన్ను ఎంతో మిస్సవుతున్నా' అంటూ లవ్ ఎమోజిస్‌తో ఎమోషనల్‌గా కామెంట్ చేశారు. నమ్రత చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. . గుంటూరు కారం చిత్రం సమయం నుంచే ఆయన SSMB29 కోసం కసరత్తులు ప్రారంభించారు. ఆ వర్కౌట్ ఫోటోలు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఆయన పోస్ట్ చేస్తుంటారు కూడా. ఈ వేసవి నుంచి షూటింగ్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment