
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మహేశ్‌బాబు. నటనాచాతుర్యంతో తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ హీరో. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్న మహేశ్ నమ్రత శిరోద్కర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 'వంశీ' సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారగా అది కాస్తా పెళ్లి దాకా వెళ్లింది.
వీరి వివాహం జరిగి నేటికి 17 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేసి సతీమణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. 'అప్పుడే 17 సంవత్సరాలు పూర్తైంది. హ్యాపీ యానివర్సరీ.. ఇలాంటి రోజులు మనం మరెన్నో జరుపుకోవాలి' అని రాసుకొచ్చాడు. ఇక నమ్రత కూడా స్పెషల్ వీడియో ద్వారా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 'సంతోషం, నమ్మకం, గౌరవం, కరుణ, సరదాతో కొనసాగిన మన ప్రేమను జీవితాంతం ఇంతే మధురంగా కొనసాగిద్దాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
So easily 17! Happy anniversary NSG!! Many more to us... it’s all about love ♥️♥️♥️ pic.twitter.com/Lw76cY77zu
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2022
Comments
Please login to add a commentAdd a comment