టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో ప్రిన్స్ మహేశ్ బాబు- నమ్రత శిరోద్కర్ జంట ఒకరు. ఇవాళ నమ్రత శిరోద్కర్ 53వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన భార్యకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే ఎన్‌ఎస్‌జీ అంటూ.. లవ్ సింబల్ జత చేస్తూ ట్వీట్ చేశారు. నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. సందడి చేయనుంది. సినిమా రిలీజ్‌కు ముందు గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో నమ్రత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Happy birthday NSG…♥️♥️♥️
Grateful for another year filled with love and togetherness. Thank you for making my every day better 😍😍😍 Have a rocking 2024!! pic.twitter.com/uy6gK8AiWs— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024
Comments
Please login to add a commentAdd a comment