ఈ గాడిద ధర అక్షరాల రూ.10 లక్షలు | 'tippu' donkey sold for rs 10 lakh | Sakshi
Sakshi News home page

ఈ గాడిద ధర అక్షరాల రూ.10 లక్షలు

Published Fri, Jun 9 2017 2:34 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

ఈ గాడిద ధర అక్షరాల రూ.10 లక్షలు

ఈ గాడిద ధర అక్షరాల రూ.10 లక్షలు

చండీగఢ్‌: టిప్పు అలాంటి ఇలాంటి గాడిద కాదు. గుర్రంలా ఒడ్డూ పొడువున్న టిప్పు ధర పది లక్షల రూపాయలట. మామూలు గాడిద లక్ష రూపాయల వరకుంటే దీని ధర అంతకు పదింతలు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గాడిదల వ్యాపారి ఐదు లక్షల రూపాయలకు కొంటా అంటే కూడా ఇవ్వలేదని, పది లక్షలకైతేనే అమ్ముతానని హర్యానాలోని సోనాపేట్‌ జిల్లాకు చెందిన గాడిద యజమాని రాజ్‌ సింగ్‌ చెబుతున్నారు.

ఈ గాడిదకు రోజుకు ఐదు కిలోల మినుములు, నాలుగు లీటర్ల పాలు, 20 కిలోల పచ్చిగడ్డి ఆహారం. అందుకు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందట. ఈ గాడిదను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు కూడా తీసుకెళతానని రాజ్‌ సింగ్‌ తెలిపారు. ఇలాంటి గాడిద చుట్టుపక్క రాష్ట్రాల్లో కూడా దొరకదని, మగ గాడిదల సంకర జాతులను పెంచే ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement