
విజయవాడలో గాడిద మాంసం విక్రయిస్తామంటూ బోర్డు పెట్టుకున్న వ్యాపారి
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కబేళాల్లో గాడిద వధ జరుగుతోందని, గాడిద మాంసాన్ని పట్టణంలో ఎక్కడ బడితే అక్కడ విక్రయిస్తున్నారని, అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
గాడిద వధను, మాంసం విక్రయాలను నిరోధించి, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతిలేని కబేళాలను మూసివేసేలా గుంటూరు మున్సిపల్ అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు చెందిన యానిమల్ రెస్కూ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎస్.గోపాలరావు, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గుంటూరు జిల్లాలో ఇష్టానుసారంగా గాడిద వధ జరుగుతోందని, రోడ్లను ఆక్రమించి జంతువులను వధిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment