
గాడిదకు హెయిర్ కట్
పని లేని... ఏదో చేశాడంట, సామెత ఇక్కడ వర్తించదు. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా పనే గాడిదలకు క్షవరం చేయడం. ఈజిప్టు రాజధాని కైరోలోని దృశ్యమిది. ఇలాంటివాళ్లు ఇంకా ఉన్నా కూడా ముస్తఫా మరింత మర్యాదస్తుడని వినియోగదారులు ఆయన దగ్గరకు వస్తుంటారు. కాదు, తమ గాడిదలను ఆయన దగ్గరకు తెస్తుంటారు. అన్నట్టూ, చరిత్రలో గాడిదలను తొలిగా మచ్చిక చేసింది ఈజిప్షియన్లేనని చెబుతారు.