మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఒక వీడియో కలకలం రేపుతోంది. ఒక గాడిద ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియో గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేస్తోంది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా, అది ఆ వృద్ధునిపై దాడిని కొనసాగిస్తూనే ఉంది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యింది.
ఎన్నో ప్రయత్నాల తరువాతనే..
ఈ ఘటన 2023 జూలై 7,ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ వీడియోలో.. ముందుగా ఒక వృద్ధుడు రోడ్డుపై వెళుతుండటం కనిపిస్తుంది. ఆ సమయంలో రోడ్డు పక్కగా ఒక గాడిద నిలుచుని ఉంటుంది. అది ఉన్నట్టుండి, ఆ వృద్ధుని దిశాగా పరిగెత్తకుంటూ వచ్చి, అతనిపై దాడికి తెగబడుతుంది. ఆ వృద్ధుడిని కింద పడవేసి తన కాళ్లతో తొక్కివేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనను గమనించిన చుట్టుపక్కల వారు ఆ వృద్ధుడిని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తారు. అయినా ఆ గాడిద తన పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంటుంది. తరువాత ఒక వ్యక్తి ఆ గాడిదపైకి రాయి విసిరినా అది ఏమాత్రం అదరదు. మరికొందరు కర్రతో దానిని కొట్టడంతో ఆది తన దాడిని విరమించి పక్కకు వెళ్లిపోతుంది. తరువాత ఆ వృద్దుడు కాస్త తేరుకుని నిలబడతాడు.
महाराष्ट्र के #कोल्हापुर में एक गधे ने सड़क पर चल रहे बुजुर्ग पर किया जानलेवा हमला..पूरी घटना CCTV में कैद..घटना गांधीनगर इलाके में 7 जुलाई सुबह 11 बजे की है..पिछले 3 दिनों में गधे द्वारा लोगों पर हमले की यह दूसरी घटना@indiatvnews@KOLHAPUR_POLICE@Dev_Fadnavis pic.twitter.com/WoWt4vCjap
— Atul singh (@atuljmd123) July 8, 2023
మూడు రోజుల్లో రెండవ దాడి ఘటన
గడచిన మూడు రోజుల్లో స్థానికంగా జంతువుల కారణంగా జరిగిన రెండవ దాడి ఇది. ఈ ఘటన కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికిముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!
Comments
Please login to add a commentAdd a comment