బస్సు - ట్రాక్టర్ ఢీ : 9 మంది మృతి | Beed,Maharashtra: seven people killed and Nine others ... | Sakshi
Sakshi News home page

బస్సు - ట్రాక్టర్ ఢీ : 9 మంది మృతి

Published Fri, Oct 30 2015 10:47 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Beed,Maharashtra: seven people killed and  Nine others ...

ముంబై : మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం బీడ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement