84 ఏళ్లు జీవిస్తా : సీఎం | My Live Is 84 Years Says CM Kumaraswamy | Sakshi
Sakshi News home page

84 ఏళ్లు జీవిస్తా : సీఎం

Published Sun, Oct 28 2018 11:13 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

My Live Is 84 Years Says CM Kumaraswamy - Sakshi

మండ్య : సమీప భవిష్యత్తులో తనకు మరణం సంభవించే అవకాశమే లేదని, 84 ఏళ్ల వరకు మృత్యువు తన దరికి చేరదంటూ సీఎం కుమారస్వామి తెలిపారు. శనివారం పాండవపుర పట్టణంలోని తాలూకా క్రీడామైదానంలో మండ్య ఎంపీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారాల్లో కుమారస్వామి మాట్లాడారు. మళవళ్లిలో ప్రచారాలు నిర్వహించే సమయంలో భావోద్వేగానికి లోనయ్యామని, అందుకే ఎప్పుడు చనిపోతామో తెలియదంటూ వ్యాఖ్యానించామన్నారు. అయితే రేపే చనిపోతానంటూ తాను ఎక్కడా చెప్పలేదని ప్రసార మాధ్యమాల్లో ఆ విధంగా ప్రచారం జరగడంతో తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని అన్నారు.

 ప్రభుత్వ శాఖల్లో అవినీతి తాండవిస్తోందని ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో కోట్ల కొద్ది నగదు, కేజీల కొద్ది బంగారు ఆభరణాలు దొరుకుతుండడం ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అద్దం పడుతోందన్నారు. రుణమాఫీపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతామని అప్పటి వరకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఓపిక పట్టాలంటూ సూచించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ బీజేపీ అర్థరహిత వ్యాఖ్యలు చేస్తోందంటూ విమర్శించారు. కార్యక్రమంలో మంత్రి సీఎస్‌ పుట్టరాజు, ఎమ్మెల్యే సురేశ్‌గౌడ, ఉపఎన్నికల అభ్యర్థి శివరామేగౌడ పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement