
మానాడు చిత్రంతో రీచార్జ్ అయిన నటుడు శింబు. ఆ తరువాత ఆయన నటించిన వెందు తనియందది కాడు చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఇటీవల విడుదలైన పత్తుతల చిత్రం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సంచలన నటుడు శింబు జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. శింబు తాజాగా కమలహాసన్ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్‌లైయడిత్తాల్ చిత్ర ఫేమ్ దేసింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు.
కాగా దీనికి ముందు శింబు మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి ఈ చిత్రం ఇంతకుముందే ప్రారంభం కావాల్సింది. అనివార్య కారణాల వల్ల శింబు ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేశారు. దీనికి బదులుగా మరో చిత్రం చేస్తానని నిర్మాత ఐసరిగణేష్‌కు ఆయన మాట ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో దర్శకుడు గోకుల్, నటుడు విజయ్‌సేతుపతిని ఇందులో నటింపజేసే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది.
అదే విధంగా నటుడు ఆర్‌జే బాలాజీ, తాజాగా నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా శింబు మళ్లీ కరోనా కుమార్ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ఆయన నటించే 48వ చిత్రం అవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
నటుడు
శింబు
Comments
Please login to add a commentAdd a comment