
హీరో శింబు పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. గతంలో నయనతార, హన్సికతో లవ్వాయణం చేసిన ఈ హీరో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో తాను కూడా వివాహం చేసుకుని సెటిలైపోవాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురితో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు కథనాలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇదంతా వుట్టి పుకారేనని తెలుస్తోంది.
శింబు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని హీరో మేనేజర్ స్పష్టం చేశాడు. 'శ్రీలంకకు చెందిన అమ్మాయితో శింబు ఏడడుగులు వేయబోతున్నాడంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. దయచేసి పెళ్లి వంటి వ్యక్తిగత విషయాల గురించి రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. నిజంగా వివాహానికి రెడీ అయినప్పుడు అందరికంటే మేమే మొదటగా ఆ న్యూస్ షేర్ చేస్తాం' అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో శింబు పెళ్లి వార్తలకు చెక్ పడినట్లైంది.
చదవండి: అనసూయ ఆంటీ వివాదంపై స్పందించిన కస్తూరి
భర్త కన్నుమూసిన వార్డులోనే కళాపతస్వి భార్య కూడా..
Comments
Please login to add a commentAdd a comment