
బిగ్‌బాస్ అల్టిమేట్ షోకు శింబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇతడిని షోకు రప్పించేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట! ఒక్క ఎపిసోడ్‌కు సుమారు కోటి రూపాయల దాకా పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన బిగ్‌బాస్ ద్వారా శింబు దాదాపు 10 కోట్ల మేర సంపాదించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది...
వెండితెర మీద మెరుపులు కురిపించే ఎంతోమంది హీరోలు పలు షోలకు వ్యాఖ్యాతగా మారడం చూశాం. బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ కోసమైతే ఏకంగా స్టార్ హీరోలే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్లకు ఎన్టీఆర్, నాని, నాగార్జున వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా తమిళ షోకు కమల్ హాసన్, కన్నడ షోకు సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా పని చేశారు. అయితే కాల్షీట్లు కుదరకపోవడంతో కమల్ బిగ్‌బాస్ ఓటీటీ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానాన్ని హీరో శింబు భర్తీ చేశాడు.
బిగ్‌బాస్ అల్టిమేట్ షోకు శింబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇతడిని షోకు రప్పించేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట! ఒక్క ఎపిసోడ్‌కు సుమారు కోటి రూపాయల దాకా పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన బిగ్‌బాస్ ద్వారా శింబు రూ.5 కోట్లు వెనకేయనున్నట్లు కనిపిస్తోంది.
#BBUltimate 🙏🏻 https://t.co/Lshz5ajZ6z
— Silambarasan TR (@SilambarasanTR_) February 27, 2022
#BBUltimate-இல் இன்று..
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 27, 2022
▶️ 6:30 pm onwards..#Day28 #Promo3 #NowStreaming only on #disneyplushotstar. @SilambarasanTR_ pic.twitter.com/fGOmZo8NKG