
కోలీవుడ్ స్టార్ శింబు గతేడాది మానాడు హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో ఒకేసారి మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశారు. ప్రస్తుతం శింబు గౌతం వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో ‘వెందు తణిందదు కాడు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో రెండు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా శింబు ఆటోడ్రైవర్‌గా కనిపించారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో శింబు సినిమాలో ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారంటూ ఆయన ఫ్యాన్స్ వరుస ట్వీట్స్ చేసి ట్రెండింగ్ చేశారు. కానీ నిజానికి ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ షూట్ కోసం శింబు ఇలా ఆటో డ్రైవర్‌గా నటించారు అని ఆయన సన్నిహితులు వివరణ ఇవ్వడంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయ్యింది.
ஆட்டோ ஓட்டுநராக ஸ்டைலான லுக்கில் நடிகர் சிலம்பரசன் வீடியோ#Silambarasan |#silambarasantr |#str |#simbu |#tamildiary pic.twitter.com/MDC0JIOzj9
— Tamil Diary (@TamildiaryIn) April 11, 2022