శింబు సినిమాలో కమల్‌ హాసన్‌? | Kamal Haasan To Play Guest Role In Simbu Upcoming 48th Film, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Simbu 48th Movie Update: శింబు సినిమాలో కమల్‌ హాసన్‌ గెస్ట్‌ రోల్‌?

Published Tue, Feb 13 2024 8:02 AM | Last Updated on Tue, Feb 13 2024 10:03 AM

Kamal Haasan Play Guest Role In Simbu 48th Film - Sakshi

తమిళ సినిమా: సంచలన నటుడు శింబు ప్రస్తుతం తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక కథా చిత్రాన్ని విశ్వనటుడు కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై భారీఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి దేశింగు పెరియసామి కళ, దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. పిరియాడికల్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం నటుడు శింబు కుంగ్‌ఫు హాస్టల్‌ ఆత్మ రక్షణ విద్యల్లో శిక్షణ పొందడంతో పాటు తన శారీరక భాషను పూర్తిగా మార్చుకున్నాడు. మరో విషయం ఏమిటంటే శింబు ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు.

ఆయన కథానాయకుడిగా, ప్రతినాయ కుడిగా నటించనుండడం మరో విశేషం. ఇందులో ఆయన సరసన నటి కీర్తి సురేష్‌, మృణాల్‌ ఠాగూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇటీవల విడుదల చేయగా అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా శింబు 48 చిత్ర అప్డేట్‌ ఏమిటంటే కమలహాసన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది.

దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగి పోతున్నాయి. చిత్ర షూటింగ్‌ మార్చి నెల రెండో వారంలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం. ఇది శింబు అభిమానులకు పండగ చేసుకునే వార్తే అవుతుంది. కాగా ఇందులో నటించే వారి వివరాలు త్వరలో వెలుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement