
తమిళసినిమా: సినిమాను, రాజకీయాలను వేరుచేయలేం. ముఖ్యంగా తమిళనాడులో ఈ రెండు రంగాలకు మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇక సినిమాల్లోనూ రాజకీయలు చోటు చేసుకోవడం పరిపాటే. నటుడు విజయ్ తన గత చిత్ర మెర్శల్‌లో సమకాలీన రాజకీయాలపై దండయాత్ర చేశారనే చెప్పవచ్చు. తాజాగా సర్కార్ చిత్రం రాజకీయాల ఇతివృత్తంతోనే తెరకెక్కుతోంది. ఇక సంచన నటుడుగా పేరొందిన శింబు తాజాగా రాజకీయాలతో కూడిన కథనే ఎంచుకున్నారు. చిన్న గ్యాప్ తీసుకున్న ఈయన మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంత వానం చిత్రంతో ఫుల్‌జోష్‌లోకి వచ్చారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తూ తన నట కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు.
షూటింగ్స్‌కు ఆలస్యంగా వస్తున్నాడనే ముద్రను తెరిపేసుకుంటూ క్రమశిక్షణను పాఠిస్తున్నారు. ఈయన తాజాగా జాలీగా సాగే చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్న వెంకట్‌ప్రభుతో జాయిన్ అవుతున్నారు. అయితే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం మాత్రం కామెడీగా ఉండదట. రాజకీయాలు, యాక్షన్ అంటే వేరే లెవల్‌లో ఉంటుందని సమాచారం. దీనికి ముందు అదిరడి అనే పేరు ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్ర వర్గాలు మానాడు అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. నిర్మాత సురేశ్ కామాక్షి తన వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించనున్నారు.ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. సంధ్యాసమయంలో రాజకీయ నాయకుల షాటో కటౌట్‌ల మధ్య స్టాండ్ ఫర్ వాట్ ఈజ్ రైట్–ఈవెన్ ఇఫ్ దట్‌మీన్స్ స్టాండింగ్ ఎలోన్ అనే స్లోగన్‌ను ఆ పోస్టర్‌లో పొందుపరిశారు. ఇక మానాడు అనే టైటిల్ కింది ఏ వెంకట్‌ప్రభు పాలిటిక్స్ అన్న ట్యాగ్‌ను పొందుపరిచారు. ఇవన్నీ చూస్తే శింబు మానాడు సంచలన చిత్రంగా అవతరించే అవకాశం ఉందనిపిస్తోంది. ఈ త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని ఆ చిత్ర వర్గాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment