తమిళనాట సినిమా వాళ్ల రాజకీయాలు చాలా టిపికల్‌గా ఉంటాయి. యాక్టర్ పొలిటీషియన్లుగా సక్సెస్ అయిన రేటు ఎక్కువే. ఫెయిల్యూర్స్ వేళ్ల మీద చెప్పొచ్చు. అయితే మాస్ స్టార్‌డమ్ ఉన్న రజనీకాంత్ ఆ ప్రయత్నంలో వెనుకంజ వేయగా.. మరో సీనియర్ కమల్‌హాసన్ మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఇక.. వీళ్లిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే.. ఆదరణ ఎలా ఉండబోతుందా? అనేది చర్చనీయాంశంగా మారిందక్కడ.
చెన్నై: తమిళనాట మరో రాజకీయ పార్టీ.. అదీ ప్రముఖ నటుడి నుంచే రాబోతుందన్న వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిగిన విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ఓ నిర్ణయం తీసుకోగా.. సభ్యులు పొలిటికల్ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
తమిళ చిత్రసీమలో నటనతోపాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఈ మధ్యే వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు. అలాగే.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్‌లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఆ సమయంలో ఓపికగా కొన్ని గంటలపాటు స్టేజ్‌పైనే ఆయన నిల్చుని ఉన్నారు కూడా. మరోవైపు విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. గ్రంథాలయాలను ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో గురువారం చెన్నై సమీప పనయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత.. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు.
గతంలో విజయ్ తండ్రి.. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయాల వైపు అడుగులు వేయించే యత్నం చేశారు. అయితే ఆ సమయంలో రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తికనబర్చని విజయ్.. తండ్రితో విబేధించారు కూడా. అయితే ఇప్పుడు విజయ్ పీపుల్స్ మూమెంట్ పేరిట సహాయక కార్యక్రమాలు చేస్తున్న ఆయన.. దానిని పార్టీగా మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
விஜய் அரசியல் பிரவேசம்.. டெல்லியில் முகாம்#Vijay | #PoliticalEntry | #VMI | #VijayMakkalIyakkham | #NewsTamil24x7 pic.twitter.com/Deirtywxla
— News Tamil 24x7 | நியூஸ் தமிழ் 24x7 (@NewsTamilTV24x7) January 25, 2024
తమిళనాట సినిమా వాళ్ల రాజకీయాలు చాలా టిపికల్‌గా ఉంటాయి. యాక్టర్ పొలిటీషియన్లుగా మారి సక్సెస్ అయిన రేటు ఎక్కువే. ఫెయిల్యూర్స్‌ను వేళ్ల మీద చెప్పొచ్చు. అయితే స్టార్‌డమ్ ఉన్న రజనీకాంత్ ఆ ప్రయత్నంలో వెనుకంజ వేయగా.. కమల్‌హాసన్ మాత్రం ఘోరంగా తడబడ్డారు. ఇక.. వీళ్లిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే.. ఆదరణ ఎలా ఉండబోతుందా? అనేది చర్చనీయాంశంగా మారిందక్కడ.
Comments
Please login to add a commentAdd a comment