విజయ్ పోస్టర్
నటుడు విజయ్ తన పుట్టినరోజు సందర్భంగా రాజకీయంగా ప్రవేశం గురించి ప్రకటించానున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. ఈనెల 22న నటుడు విజయ్ పుట్టిన రోజు. సాధారణంగా ఆయన పుట్టిన రోజును అభిమానులు ముగ్గులు, ఆర్భాటాలతో ఒక ఒక పండుగలాగా జరుపుకుంటారు. అలాంటిది ప్రస్తుత కరోనా కాలంలో తన పుట్టిన రోజు వేడుకలను ఎవరూ నిర్వహించవద్దని విజయ్ ఇప్పటికే తన అభిమానులకు ఒక ప్రయోగం ద్వారా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ అభిమానులు కొందరు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సంచలన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
మధురై లోని విజయ్ అభిమానుల రూటే వేరు. అంతా మీర అభిమానులే అక్కడ ఉన్నారు. మీరంతా ఇప్పుడు మదురై జిల్లాలో విజయ్ పుట్టినరోజును పురస్కరించుకొని పోస్టర్లను విడుదల చేశారు. ఆ పోస్టులు ఇప్పుడు మధురై లోని వాడవాడలా గోడలపై హల్‌చల్ చేస్తున్నాయి. విశేషం ఏమిటంటే ఆ పోస్టులపై తమిళ్ మాట్లాడుతూ మోటు శివాజీ గణేషన్, కమల్ హాసన్ సరసన నటుడు. విజయ్ ఫొటోను ముద్రించారు. నిజానికి విజయ్ నటుడు రజనీకాంత్ వీరాభిమాని . అలాంటిది ఆ పోస్టర్లో రజనీకాంత్ ఫోటో లెక పోవడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా నటుడు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వెల్లడిస్తారని, ఇంత కాలంగా మౌనం పాటిస్తున్న కొన్ని విషయాలను బద్ధలు కొట్టనున్నారని అందులో పేర్కొన్నారు. చదవండి: కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి
సహజంగానే విజయ్‌పై అధికార ప్రభుత్వం నాయకులకు ఒక కన్ను ఉందన్నది తెలిసిందే. విజయ్ తన చిత్రాల్లో ప్రభుత్వ విధానాలను ఏకేస్తుంటారు. ఆ మధ్య సర్కార్ చిత్రం విడుదల సాయం పెద్ద సమస్యే తలెత్తింది. ఇక బిగిల్ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం వేదిక పైనా తనను ఏమైనా అనండి. తన అభిమానుల జోలికి మాత్రం రాకండి అంటూ ప్రభుత్వాన్ని విజయ్ పరోక్షంగా హెచ్చరించిన విషయం, దానిపై ప్రభుత్వ నేతలు ఫైర్ అయిన విషయం విథితమే. తాజాగా మదురై అభిమానుల చేతలు విజయ్‌ను ఎలాంటి సమస్యల్లో నెడుతాయో చూడాలి. చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన నటి !
Comments
Please login to add a commentAdd a comment