
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వారసుడు చిత్రంతో పాటు లోకేశ్ కనకరాజు డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా చెన్నైలోని ఓ పోష్ ఏరియాలో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడట. దీని ఖరీదు అక్షరాలా 35 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్, తన భార్య సంగీత, పిల్లలు దివ్య సాష, జాసన్ సంజయ్‌తో కలిసి ఈసీఆర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అడయార్‌లోని తన పాత ఇంట్లో ఆఫీస్‌ను నిర్వహిస్తున్నాడు.
కాగా విజయ్ ప్రస్తుతం తన ఆఫీస్‌ను కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను హీరో ఆర్య సొంతం చేసుకున్నాడట. దీంతో హీరోలు ఆర్య, విజయ్ ఇద్దరూ ఇరుగుపొరుగువారయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్‌చుప్!
మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment