థాను ఖాతాలో వెళైయా ఇరుకిరవన్ పొయ్‌సొల్లామల్లాన్ | In thanu account velaiya irukiravan poysollamallan | Sakshi
Sakshi News home page

థాను ఖాతాలో వెళైయా ఇరుకిరవన్ పొయ్‌సొల్లామల్లాన్

Published Tue, Aug 25 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

థాను ఖాతాలో వెళైయా ఇరుకిరవన్ పొయ్‌సొల్లామల్లాన్

థాను ఖాతాలో వెళైయా ఇరుకిరవన్ పొయ్‌సొల్లామల్లాన్

వెళైయా ఇరుకిరవన్ పొయ్ సొల్లమాట్టాన్(తెల్లగా ఉండే వాడు అసత్యమాడడు)పేరుతో చిత్రం రూపొందింది. ఛాయాగ్రాహకుడు రవివర్మ సమర్పణలో ఇగ్నిటీ ఫిలింస్ పతాకంపై దేవంశు ఆర్య నిర్మించిన ఈ చిత్రానికి ఏయల్, అబనింద్రన్ దర్శకత్వం వహించారు. నవ జంట ప్రవీణ్‌కుమార్, శాలిని వద్నికటి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కార్తీక్‌కుమార్, సనమ్‌శెట్టి, బాలా, ఆడుగళం నరేన్, జయప్రకాశ్, అరుళ్‌దాస్, ఎంజే.శ్రీరామ్, పళని, సూపర్‌గుడ్ సుబ్రమణి, ఫైవ్‌స్టార్ క్రిష్ణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జోశ్వా శ్రీధర్ సంగీత భాణీలు అంధించిన ఈ వెళైయా ఇరుకిరవన్ పోయ్ సొల్లమాట్టాన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సోమవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ఏయల్ అబనింద్రన్ మాట్లాడుతూ వెళైయా ఉరుకిరవన్ పొయ్ సొల్లమాట్టాన్ అంటే ఇది మేని వర్ణం గురించి చెప్పే కథ కాదన్నారు.

మంచి మనసు గల వాడు అబద్ధం చెప్పరనే ఇతి వృత్తంతో తెర కెక్కించిన చిత్రం ఇదని వెల్లడించారు. చిత్రాన్ని కొత్తగా తీశామనే నమ్మకం ఉంన్నారు. ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.ధానుకు చిత్రాన్ని చూపించామన్నారు. చిత్రం చూసిన ఆయన బాగుందని అభినంధించి తానే విడుదల చేస్తానని హక్కులు పొందడంతో ఇప్పుడిది పెద్ద చిత్రమయ్యిందన్నారు. చిత్రాన్ని అక్టోబర్ తొలి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement