సామ్రాజ్యం కోసం... | Samrajyam movie hero as arya | Sakshi
Sakshi News home page

సామ్రాజ్యం కోసం...

Published Tue, Dec 1 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

సామ్రాజ్యం కోసం...

సామ్రాజ్యం కోసం...

ప్రతి మనిషి పుట్టుకకూ ఓ కారణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ఆరాటపడుతుంటారు. తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం హీరో ఏం చేశాడు? ఎవరితో తలపడ్డాడు. చివరికి విజయం సాధించాడా, లేదా? తెలుసుకోవాలంటే తమ చిత్రం చూడాల్సిందే అంటున్నారు నిర్మాత నైనాల సాయిరామ్. ఆర్య, కీర్తి జంటగా చరణ్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన ఓ చిత్రాన్ని వీవీయస్ క్రియేషన్స్ పతాకంపై ‘సామ్రాజ్యం’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఆర్య తన కెరీర్‌లో చేసిన తొలి మాస్ సినిమా ఇది. తమిళంలో మంచి హిట్ అయింది. తెలుగు నేటివిటీకి పక్కాగా సరిపోయే కథ ఇది. పాటలు, ఫైట్స్, వినోదం హైలెట్‌గా ఉంటాయి. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భరద్వాజ్, సహ నిర్మాత: రాజశ్రీ మణికంఠ, సమర్పణ: నైనాల సాంబమూర్తి, హైమావతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement