అమీర్ దర్శకత్వంలో ఆర్య | Arya in Amir director | Sakshi
Sakshi News home page

అమీర్ దర్శకత్వంలో ఆర్య

Published Tue, Jun 21 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

అమీర్ దర్శకత్వంలో ఆర్య

అమీర్ దర్శకత్వంలో ఆర్య

 దర్శకుడు అమీర్, నటుడు ఆర్య కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. రామ్, పరుత్తివీరన్ వంటి వైవిధ్య భరిత చిత్రాల దర్శకుడు అమీర్. ఇక నటుడు ఆర్య పలు కమర్షియల్ కథా చిత్రాలలో నటించినా, నాన్ కడవుల్, అవన్ ఇవన్ లాంటి అసాధారణ కథా చిత్రాలలోనూ నటించి మెప్పించారు.
 
 అలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం అంటే ఆసక్తిని రేకెత్తించడం సహజమే. ఆదిభగవాన్ తరువాత అమీర్ తదుపరి చిత్రం చేయలేదు. చాలా గ్యాప్ తరువాత మంచి కమర్షియల్ కథతో రానున్నారని తెలిసింది. ఆర్య ప్రస్తుతం కడంభన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాఘవన్ దర్శకత్వంలో సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది.
 
 ఈ చిత్రం కోసం ఆర్య భారీగా బరువును పెంచి నటిస్తున్నారు.తదుపరి చిత్రం కోసం చాలా కథలు వింటున్నారట. అలా దర్శకుడు అమీర్ ఆర్యను కలిసి కథ వినిపించారు. ఈ కథలో కథానాయకుడు చాలా బలమైన వాడుగా ఉంటారట. ఈ పాత్రకు ఆర్య బాగా నప్పుతాడని అమీర్ భావించారట. త్వరలోనే ఈ రేర్ కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement